విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాజీవ్ గాంధీ స్మారక అండర్-19 జాతీయ, అంతర్జాతీయ టి20 క్రికెటఖ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టు చాంపియన్ గా నిలిచింది. రాజస్థాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ ను కైవసం చేసుకుంది. ట?స గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థానఖ జట్టు 19.3 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ (21) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో మిక్కీ జైశ్వాల్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 74 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 11.1 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది.
సాగర్ (25) వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో బహత్ 2 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ ఆసాంతం రాణించిన రోహిత్ ‘బెస్ బ్యాట్స్ మన్ ’ పురస్కారాన్ని గెలుచుకోగా... అజయ్ దేవ్ బెస్త్ బౌలర్’, సాగర్ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డులను దక్కించుకున్నారు. సాయి ప్రతీక్, సాయి ప్రణయ్లకు ‘బెస్ట్ కీపర్’ పురస్కారం దక్కింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు భట్టి విక్రమార్క, హనుమంతరావు పాల్ఠ్గని విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ , క్రికెటఖ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు సాజిద్ పాషా, జనరల్ సెక్రటరీ అమర్‌జీత్ కుమార్ పాల్గొన్నారు.