
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో హైదరాబాద్ వాసి పాలవరపు మనోజ్ రజత పతకంతో మెరిశాడు. ఢిల్లీలో జరిగిన వాకో ఓపెన్ అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో 19 ఏళ్ల మనోజ్ కిక్ లైట్ ఈవెంట్‌లో ఓపెన్ వెయిట్ అండ్ హెవీ వెయిట్ విభాగంలో పతకం సాధించాడు. ఈ నెల 9 నుంచి 13 వరకు ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో బోయినిపల్లికి చెందిన మనోజ్ సిల్వర్ మెడల్ గెలుచుకోవడం పట్ల స్థానికులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం మనోజ్ ఢిల్లీ నుంచి హైదరబాద్‌కు చేరుకున్నాడు. అతడికి క్రీడా అభిమానులు, కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనస్వాగతం పలికారు.