పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే: గోపీచంద్ | I was lucky I wasn't good in studies: Gopichand | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే: గోపీచంద్

Published Wed, Aug 31 2016 3:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే: గోపీచంద్

పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే: గోపీచంద్

న్యూఢిల్లీ: బాగా చదువుకుని గొప్పవారైనవారు ఎందరో ఉన్నారు. అయితే చదువు అంతగా రాకపోవడం తన అదృష్టమని బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ చెబుతున్నాడు. అంతర్జాతీయ షట్లర్గా ఎదిగిన గోపీ.. రిటరైన తర్వాత కోచ్గా ఎందరో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశాడు. గోపీ శిక్షణలో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒలింపిక్ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. గోపీ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.

ఓ సన్మాన కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజులు, షట్లర్గా ఎదుగుతున్న రోజులను గుర్తుచేసుకున్నాడు.  పరీక్షల్లో ఫెయిల్కావడం తనకు కలిసివచ్చిందని, దీనివల్ల బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కెరీర్ను కొనసాగించి విజయవంతమయ్యానని చెప్పాడు. 'చిన్నప్పుడు నేను, నా సోదరుడు క్రీడలు ఆడేవాళ్లం. నా సోదరుడు అప్పట్లో స్టేట్ చాంపియన్. ఐఐటీ పరీక్ష రాసి పాసయ్యాడు. ఐఐటీ  చేసేందుకు వెళ్లడంతో క్రీడలను ఆపేశాడు. నేను ఇంజనీరింగ్ పరీక్ష రాస్తే ఫెయిలయ్యాను. దీంతో క్రీడలను కొనసాగించా. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నా. చదువులో చురుగ్గాలేకపోవడం నా అదృష్టమని భావిస్తున్నా' అని గోపీచంద్ అన్నాడు. అంతర్జాతీయ షట్లర్గా ఎదిగిన గోపీచంద్.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన రెండో భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. ఆ తర్వాత అకాడమీ స్థాపించి మేటి క్రీడాకారులను తయారు చేశాడు.

అకాడమీని నెలకొల్పే సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని గోపీచంద్ చెప్పాడు. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో పాటు కొందరు సాయం చేశారని తెలిపాడు. 2004లో 25 మంది పిల్లలతో అకాడమీని ప్రారంభించానని గుర్తుచేసుకున్నాడు. సింధు 8 ఏళ్ల వయసులో అకాడమీలో చేరిందని తెలిపాడు. ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ పతకం గెలవాలన్న తన కల నాలుగేళ్ల క్రితం సాకారమైందని చెప్పాడు. 2012 లండన్ ఒలింపిక్ గేమ్స్లో సైనా కాంస్యపతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్లో పీవీ సింధు రజత పతకం గెలిచింది. ఈ సన్మాన కార్యక్రమంలో పీవీ సింధు తండ్రి పీవీ రమణ పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement