
టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మౌరెస్మో
ప్రపంచ మహిళల టెన్నిస్ మాజీ నంబర్‌వన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్)కు అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది. ప్రస్తుతం బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు కోచ్‌గా వ్యవహరిస్తున్న 36 ఏళ్ల మౌరెస్మో 2006లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది. అదే ఏడాది 36 వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగింది. కెరీర్ మొత్తంలో 25 టైటిల్స్ నెగ్గిన ఆమె 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజతం సాధించింది.