మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీస్ నేడు
మ. గం. 2.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య సెమీఫైనల్‌కు ముందు అదే మైదానంలో మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఇందులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. లీగ్ దశలో పరాజయం ఎరుగని ఇంగ్లండ్... ఆస్ట్రేలియాతో పోలిస్తే ఈసారి మంచి ఫామ్‌లో ఉంది.
సాధారణంగా అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంలో నిలిచి ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనే ఆడాల్సి వచ్చింది. 2009 నుంచి ఐసీసీ మహిళలకు టి20 ప్రపంచకప్ నిర్వహిస్తోంది. తొలిసారి ఇంగ్లండ్ గెలిస్తే... ఆ తర్వాత మూడుసార్లు ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది.