![Team India Fight With Ireland In ICC Women World T20 - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/15/mithali-raj.jpg.webp?itok=7i8GddMC)
గయానా: మహిళల టీ20 ప్రపంచకప్ 2018లో సెమీస్ చేరలాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐర్లాండ్ ముందు 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మిథాలీ రాజ్( 51; 56 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) అర్థసెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(33) రాణించడంతో హర్మన్‌ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు చెలరేగడంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. అయితే మ్యాచ్ ప్రారంభంలో బౌలింగ్‌లో విఫలమైన ఐర్లాండ్ ఆటగాళ్లు చివర్లో టీమిండియాను కట్టడి చేశారు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. చివర్లో భారీ షాట్‌లకు ప్రయత్నించి హర్మన్(7), రోడ్రిగ్స్(18), వేద కృష్ణమూర్తి (9) విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment