ICC Womens World T20
-
మహిళల టి20 ప్రపంచకప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ (ఫొటోలు)
-
అమ్మాయిల ఆటకట్టు!
తొలిసారి ఐసీసీ టోర్నీని గెలుచుకోవాలని ఆశించిన భారత మహిళల జట్టుకు సెమీ ఫైనల్లోనే భంగపాటు ఎదురైంది. ఏడాది క్రితం వన్డే ఫైనల్లో మన ఆశలు కూల్చిన ఇంగ్లండ్ ఈసారి మరో అడుగు ముందే టీమిండియా ఆట కట్టించింది. సీనియర్ ప్లేయర్‌ను పక్కన పెట్టిన వ్యూహాత్మక తప్పిదం మొదలు పిచ్‌కు తగినట్లుగా ఆటతీరును మార్చుకోలేక బ్యాటింగ్‌లో కుప్ప కూలడం, ఆపై ఆరుగురు స్పిన్నర్లు కూడా ప్రత్యర్థిపై ప్రభావం చూపలేకపోవడంతో మన పోరు తుది సమరానికి చేరక ముందే ముగిసి పోయింది. లీగ్ దశలో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద కనిపించిన హర్మన్ సేన అసలు ఆటలో మాజీ చాంపియన్ ముందు నిలవలేక చేతులెత్తేసింది. నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు మూడోసారి సెమీఫైనల్‌కే పరిమితమైంది. గతంలో రెండు సార్లు సెమీస్ చేరిన టీమిండియా ఈసారి అద్భుతమైన ఫామ్‌లో ఉండి కూడా ఆ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్ర వారం తెల్లవారు జామున ఇక్కడి సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాప్–4 మినహా మిగతా ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ (3/9), కిర్స్టీ గార్డన్ (2/20), ఎకెల్‌స్టోన్ (2/22) భారత్‌ను దెబ్బ తీశారు. భారత్ ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు ఉన్నాయి. అనంతరం ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమీ జోన్స్ (47 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), నటాలీ స్కివర్ (38 బంతుల్లో 52; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. 23 పరుగులకే 8 వికెట్లు... స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో భారత్‌కు శుభారంభమే లభించింది. 13 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను ఎకెల్‌స్టోన్ వదిలేసింది. ఆ వెంటనే ఎకెల్‌స్టోన్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్మృతి ఫోర్, సిక్సర్ బాదింది. అయితే చివరకు ఆమె ఓవర్లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి స్మృతి వెనుదిరిగింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 కాగా... ఆ ఓవర్ చివరి బంతికి భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ తాన్యా (11) ప్రభావం చూపలేకపోయింది. అయితే హర్మన్ (20 బంతు ల్లో 16; 1 సిక్స్), జెమీమా కలిసి వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, 1 సిక్సర్ సహా భారత్ 19 పరుగులు రాబట్టింది. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి జెమీమా రనౌట్ కావడంతో ఆట మలుపు తిరిగింది. గార్డన్ ఒకే ఓవర్లో వేద కృష్ణమూర్తి (2), హర్మన్లను ఔట్ చేయగా... హీతర్ నైట్ వరుస బంతుల్లో హేమలత (1), అనూజ (0)లను డగౌట్ పంపించింది. రాధ (4) రనౌట్ కాగా, చివరి ఓవర్లో అరుంధతి (6), దీప్తి (7) ఔట్ కావడంతో మరో మూడు బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. అలవోకగా... స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి కొంత ఆశలు రేపారు. రెండో ఓవర్లోనే బీమాంట్ (1)ను రాధ ఔట్ చేయగా...తడబడుతూ ఆడిన వ్యాట్ (8)ను దీప్తి వెనక్కి పంపించింది. అయితే ఈ దశలో జోన్స్, స్కివర్ సమర్థంగా ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. భారత బ్యాటింగ్‌ను చూసిన అనుభవంతో ఎలాంటి సాహసాలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. పిచ్‌ను సరిగా అంచనా వేయడంలో వీరిద్దరు సఫలమయ్యారు. 2 పరుగుల వద్ద స్కివర్ ఇచ్చిన క్యాచ్‌ను పూనమ్ వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా వీరిద్దరు జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో ముందుగా స్కివర్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అనూజ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన జోన్స్ అర్ధసెంచరీతో పాటు మ్యాచ్‌ను కూడా ముగించింది. ‘హర్మన్ మోసకారి’ ‘ఆమె అబద్ధాల కోరు, మోసకారి, తారుమారు చేసే మనిషి, పరిణతి చెందలేదు. కెప్టెన్‌గా పనికి రాదు. మహిళల క్రికెట్ ఆట కంటే రాజకీయాలను ఎక్కువగా నమ్ముతుండటం దురదృష్టకరం’ అంటూ హర్మన్‌ప్రీత్‌పై మిథాలీ రాజ్ మేనేజర్ అనీషా గుప్తా నిప్పులు చెరిగింది. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో మిథాలీని ఆడించకపోవడంపై తన ఆగ్రహాన్నంతా ట్విట్టర్లో వెళ్లగక్కింది. -
మెరిసిన స్మృతి మంధాన.. ఆసీస్ లక్ష్యం 168
ప్రొవిడెన్స్ (గయానా): మహిళల టీ20 ప్రపంచప్‌లో భాగంగా గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్మృతి మంధాన (83; 55 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా, హర్మన్‌ప్రీత్ కౌర్( 43; 27 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగలింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌కు విశ్రాంతినివ్వడంతో ఒపెనర్‌గా వచ్చిన వికెట్‌కీపర్ తానియా భాటియా (2) పూర్తిగా నిరాశ పరిచింది. అనంతర క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్ (6) కూడా తక్కువ స్కొర్కే వెనుదిరిగింది. మంధాన, హర్మన్‌ప్రీత్ ధనాధన్ ఓ వైపు వికెట్లు పడుతున్నా స్టార్ ఓపెనర్ మంధాన తనదైన రీతిలో చెలరేగిపోయింది. అగ్నికి వాయువు తోడైనట్టు మంధానకు హర్మన్‌ప్రీత్ జత కలిసింది. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరి జోరుకు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మంధాన టీ20ల్లో ఆరో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే వీరిద్దరి వీరవిహారానికి స్కోర్ 200 దాటుతుందా అనిపించింది. కానీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హర్మన్ ప్రీత్ వెనుదిరగగా, అనంతరం క్రీజులోకి వచ్చిన వారు ఘోరంగా విఫలమయ్యారు. వేద కృష్ణమూర్తి(3), హేమలత(1), దీప్తి(8) వెంటవెంటనే వెనుదిరిగారు. అయితే చివర్లో సెంచరీ సాధిస్తుందనుకున్న తరుణంలో మంధాన భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. ఆసీస్ ఆటగాళ్లలో పెర్రీ(3/16), కిమిన్సే(2/42), గార్డనర్(2/25)లు రాణించారు. -
టీమిండియాతో మ్యాచ్.. ఐర్లాండ్ లక్ష్యం 146
గయానా: మహిళల టీ20 ప్రపంచకప్ 2018లో సెమీస్ చేరలాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐర్లాండ్ ముందు 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మిథాలీ రాజ్( 51; 56 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) అర్థసెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(33) రాణించడంతో హర్మన్‌ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు చెలరేగడంతో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. అయితే మ్యాచ్ ప్రారంభంలో బౌలింగ్‌లో విఫలమైన ఐర్లాండ్ ఆటగాళ్లు చివర్లో టీమిండియాను కట్టడి చేశారు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. చివర్లో భారీ షాట్లకు ప్రయత్నించి హర్మన్(7), రోడ్రిగ్స్(18), వేద కృష్ణమూర్తి (9) విఫలమయ్యారు. -
హర్మన్ ప్రీత్‌పై నెటిజన్ల ప్రశంసలు
గయానా : టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి వార్తల్లో నిచిచారు. ధనా ధన్ షాట్లతో బంతిని బౌండరీలకు తరలించడమే కాదు, సమయస్పూర్తితో వ్యవరించి అభిమానుల హృదయాలను కౌర్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లోనే హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల టీ20 క్రికెట్లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కూడా హర్మన్‌ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు జాతీయగీతం ఆలపించే సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇరు జట్లు జాతీయ గీతం పాడడానికి మైదానంలో నిల్చున్న సమయంలో ఎప్పటిలానే ఒక్కోక్కరి ముందు ఒక్కో చిన్నారి నిల్చున్నారు. చిన్నారులందరూ టీ20 ప్రపంచకప్ మస్కట్ ఉన్న టీషర్టులు ధరించి అక్కడ నిల్చున్నారు. అయితే సరిగ్గా భారత జాతీయ గీతం ప్రారంభమయ్యే సమయంలో తన ముందు నిల్చున్న చిన్నారి అనారోగ్యానికి గురవ్వడాన్ని హర్మన్ ప్రీత్ కౌర్ గమనించింది. జాతీయగీతం అయిపోయేంత వరకు సదరు చిన్నారిని చేతితో పట్టుకుంది. జాతీయ గీతాలాపన పూర్తయిన వెంటనే చేతులతో చిన్నారిని ఎత్తుకుని వెంటనే తీసుకెళ్లి మేనేజ్మెంట్ వాళ్లకి అప్పగించింది. ఓ వైపు జాతీయ గీతాన్ని ఆలకిస్తూనే, మరోవైపు చిన్నారిని కిందపడకుండా హర్మన్ సమయస్పూర్తితో వ్యవహరించారని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు వరుసగా రెండో విజయం నమోదు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు), నిదా దార్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/22), హేమలత (2/34) ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకుగాను పెనాల్టీగా అంపైర్లు భారత జట్టుకు 10 పరుగులు అదనంగా కేటాయించారు. లక్ష్య ఛేదనలో మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు), స్మృతి మంధాన (26; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగడంతో భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసి గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. -
అభిమానుల హృదయాలు గెలుచుకున్న కౌర్
-
ఇంగ్లండ్ x ఆస్ట్రేలియా
మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీస్ నేడు మ. గం. 2.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య సెమీఫైనల్‌కు ముందు అదే మైదానంలో మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఇందులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. లీగ్ దశలో పరాజయం ఎరుగని ఇంగ్లండ్... ఆస్ట్రేలియాతో పోలిస్తే ఈసారి మంచి ఫామ్‌లో ఉంది. సాధారణంగా అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో రెండో స్థానంలో నిలిచి ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనే ఆడాల్సి వచ్చింది. 2009 నుంచి ఐసీసీ మహిళలకు టి20 ప్రపంచకప్ నిర్వహిస్తోంది. తొలిసారి ఇంగ్లండ్ గెలిస్తే... ఆ తర్వాత మూడుసార్లు ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది.