జూడో చాంప్స్ ఒమర్, ఇనాయత్ | inayat, omar wins judo titles | Sakshi
Sakshi News home page

జూడో చాంప్స్ ఒమర్, ఇనాయత్

Published Fri, Sep 30 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

inayat, omar wins judo titles

ఓయూ ఇంటర్ కాలేజి టోర్నీ
 
 సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజియేట్ జూడో టోర్నమెంట్‌లో మొహమ్మద్ ఒమర్ ఖాన్, ఇనాయత్ విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజి గ్రౌండ్‌‌సలో గురువారం జరిగిన 56 కేజీ కేటగిరీలో ఒమర్ ఖాన్ స్వర్ణం సాధించగా, అబ్దుల్ హన్నన్ రజతం, మణికంఠ రెడ్డి, ఆమిర్ కాంస్య పతకాలు నెగ్గారు. 60 కేజీ కేటగిరీలో మొహమ్మద్ ఇనాయత్ గెలుపొందగా, ఉస్మాన్ ఖాన్ రజతం, రిజ్వాన్, శ్యామ్ ప్రసాద్ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఆతిథ్య కాలేజి జూడోకాలకే ఓవరాల్ చాంపియన్‌షిప్ దక్కింది. అన్వర్ వులూమ్ కాలేజి (మల్లేపల్లి)కి రెండో స్థానం, నిజామ్ కాలేజికి మూడో స్థానం లభించాయి.

 ఇతర కేటగిరీల ఫలితాలు

 66 కేజీలు: 1. సలామ్ సలేహ్, 2. అలీ అమూది, 3. మహ్మద్ జాఫర్, షేక్ ముస్తఫా పాషా; 73 కేజీలు: 1. అబ్దుల్ వాహిద్, 2. అబుబాకర్ అహ్మద్, 3. అవనీంద్ర రావు, రాకేశ్; 81 కేజీలు: 1. ఇబ్రహీం బిన్ కై జర్, 2. సయ్యద్ ఆమిర్, 3. కరీమ్ పాషా, తారాసింగ్; 90 కేజీలు: 1. ముజాహిద్ ఖాన్, 2. మొహమ్మద్ నయీం; 100 కేజీలు: 1. అహ్మద్ హుస్సేన్, 2. మహ్మద్ మహమూద్, 3. రోహన్ సింగ్, మహ్మద్ జహంగీర్; ఓపెన్ కేటగిరీ: 1. సాజిద్ అలీ, 2. అసద్ రిజ్వాన్, 3. అహ్మద హుస్సేన్,
 రోహన్ సింగ్.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement