
ఆక్లాండ్: విజయంతో న్యూజిలాండ్ పర్యటనను ఆరంభించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆదివారం అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 కోసం ఇరుజట్లు సన్నద్దమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ లక్ష్యాన్ని కోహ్లి సేనకు నిర్దేశించాలనే ఉద్దేశంతో కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఇరుజట్లు కూడా రెండో టీ20 కోసం ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్నాయి.
టాస్ సందర్భంగా సారథి విరాట్ కోహ్లి మాట్లాడుతూ’ మేము టాస్ గెలిచినా తొలుత బౌలింగే ఎంచుకునేవాళ్లం. అయితే టాస్ ఓడినా లక్కీగా తాము అనుకున్నదే దక్కింది. ఇక బౌలింగ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తొలి టీ20 ఆడిన ఇదే పిచ్‌పై రెండో మ్యాచ్ కూడా ఆడేందుకు ఉత్సాహంతో ఉన్నాము. గత మ్యాచ్‌లో పది పరుగుల వరకు అదనంగా ఇచ్చాము. ఆ పొరపాటును ఈ మ్యాచ్‌లో చేయకూడదనే అనుకుంటున్నాం’. తొలి విజయాన్ని అందించిన మైదానంలోనే ఉత్సాహంతో కోహ్లి సేన బరిలోకి దిగుతుండగా.. ఎక్కడ ఓడిపోయామే అక్కడే గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని విలియమ్సన్ అండ్ గ్యాంగ్ ఆరాటపడుతోంది.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దుబె, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, చహల్, జస్ప్రిత్ బుమ్రా
న్యూజిలాండ్: కేన్స్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, కోలిన్ మున్రో, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, రాస్ టేలర్, టిమ్ సీఫెర్ట్, మిచెల్ సాంట్నర్, బ్లెయిర్ టిక్‌నెర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, హమీశ్ బెన్నెట్
Comments
Please login to add a commentAdd a comment