కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) భారత్ తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు ఓవర్లలో భారత్ రెండు వికెట్ కోల్పోయి 32 పరుగులుచేసింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ(17), రైనా(1) లు క్రీజ్ లో ఉన్నారు. 28 పరుగుల వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్ లో శిఖర్ ధావన్(11) అవుటయ్యాడు. 30 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో కోహ్లి(1) రనౌట్ గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్ క్రిస్ మోరిస్ కు ఒక వికెట్ లభించింది.