భారత్ ‘ఎ’ ఓటమి | India 'A' Lose to Australia 'A' Despite Sanju Samson Heroics | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ ఓటమి

Published Mon, Jul 21 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

India 'A' Lose to Australia 'A' Despite Sanju Samson Heroics

 28 పరుగులతో ఆసీస్ ‘ఎ’ గెలుపు
 డార్విన్: నాలుగు జట్ల వన్డే టోర్నీని భారత్ ‘ఎ’ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 28 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై నెగ్గింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.
 
  అలెక్స్ డూలన్ (101 బంతుల్లో 96; 9 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి, మోహిత్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 46.2 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. సంజు శామ్సన్ (98 బంతుల్లో 81; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’తో భారత్ ‘ఎ’ ఆడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement