one day tournment
-
ఎదురులేని ఆంధ్ర
న్యూఢిల్లీ: మరోసారి సమష్టి ప్రదర్శన చేసిన ఆంధ్ర జట్టు విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నమెంట్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సౌరాష్ట్రతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచి 18 పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగులు సాధించింది. అర్పిత్ (55; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, మనీశ్, షోయబ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ప్రశాంత్ కుమార్ (81 బంతుల్లో 73; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బోడపాటి సుమంత్ (49 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రవితేజ (26 బంతుల్లో 29 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు. -
ఆంధ్ర ఓటమి
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. అజేయంగా సెమీస్ చేరిన ఆంధ్ర ఆదివారం జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర చేతిలో 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ కాగా... ఆంధ్ర 45.3 ఓవర్లలో 196 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా (56; 4 ఫోర్లు, 1 సిక్స్), అర్పిత్ (58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సౌరాష్ట్ర గౌరవప్రద స్కోరు చేసింది. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. భరత్ (29), అశ్విన్ హెబర్ (12), కెప్టెన్ విహారి (25), రికీ భుయ్ (13) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. సుమంత్ (42; 2 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (42) పోరాడినా లాభం లేకపోయింది. మంగళవారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడుతుంది. -
హైదరాబాద్ ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: సమష్టి ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. జమ్మూ కశ్మీర్‌తో సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ 149 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ సరిగ్గా 50 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ ధాటికి హైదరాబాద్ 41 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ రాయుడు (130 బంతుల్లో 130; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), బావనాక సందీప్ (74 బంతుల్లో 72; 5 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. రోహిత్ ఈ టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేయగా... సందీప్ రెండో అర్ధ సెంచరీ సాధించాడు. స్కోరు 212 పరుగులవద్ద సందీప్ ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ధాటిగా పరుగులు సాధించే క్రమంలో హైదరాబాద్ వికెట్లు కోల్పోయి 312 పరుగులకు ఆలౌటైంది. జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కశ్మీర్ ఏదశలోనూ లక్ష్యాన్ని ఛేధించేలా కనిపించలేదు. హైదరాబాద్ బౌలర్లు సిరాజ్ (2/33), రవికిరణ్ (2/17), ఆకాశ్ భండారి (3/34) వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆ జట్టు 34.1 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఇదే గ్రూప్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ ఏడు వికెట్లతో జార్ఖండ్‌పై... సౌరాష్ట్ర ఎనిమిది వికెట్లతో సర్వీసెస్‌పై గెలిచాయి. ప్రస్తుతం గ్రూప్ ‘డి’లో విదర్భ, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... 12 పాయింట్లతో సౌరాష్ట్ర రెండో స్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరి రౌండ్లో ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్; విదర్భతో సౌరాష్ట్ర తలపడతాయి. సమీకరణాల ప్రకారం ఈ నాలుగు జట్లకూ క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉన్నాయి. -
భారత్ ‘ఎ’ ఓటమి
28 పరుగులతో ఆసీస్ ‘ఎ’ గెలుపు డార్విన్: నాలుగు జట్ల వన్డే టోర్నీని భారత్ ‘ఎ’ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 28 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై నెగ్గింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అలెక్స్ డూలన్ (101 బంతుల్లో 96; 9 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి, మోహిత్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 46.2 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. సంజు శామ్సన్ (98 బంతుల్లో 81; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’తో భారత్ ‘ఎ’ ఆడుతుంది. -
శివ 4-3-6-4
చెలరేగిన ఆంధ్ర బౌలర్ హైదరాబాద్ పరాజయం సాక్షి, విజయనగరం: సరిగ్గా నెల రోజుల క్రితం సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో హైదరాబాద్‌ను చిత్తు చేసిన ఆంధ్ర జట్టు పరిమిత ఓవర్లలో మరోసారి తన ఆధిక్యం ప్రదర్శించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (సౌత్‌జోన్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన టి20 మ్యాచ్‌లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన ఆంధ్రకు ఇది తొలి గెలుపు కాగా... హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి. దువ్వారపు శివకుమార్ (4-3-6-4) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు శివకుమార్, బోడవరపు సుధాకర్ (3/9) ధాటికి 20 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. సందీప్ రాజన్ (35 బంతుల్లో 21; 3 ఫోర్లు)దే టాప్ స్కోర్ కాగా, ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. శివకుమార్ 3 మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. అనంతరం ఆంధ్ర 11.3 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శ్రీకాంత్ (0) తొలి ఓవర్లోనే అవుటైనా... కెప్టెన్ ప్రశాంత్ కుమార్ (34 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), జ్యోతి సాయికృష్ణ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించి మరో 51 బంతులు మిగిలి ఉండగానే ఆంధ్రను గెలిపించారు. ఈ పరాజయంతో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో గోవాతో హైదరాబాద్, కేరళతో ఆంధ్ర తలపడతాయి. -
హైదరాబాద్ పరాజయం
బెంగళూరు: బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ జట్టు సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పటిష్టమైన తమిళనాడు బౌలర్లను ఎదుర్కోలేక తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. దీంతో ఆదిత్య అకాడమీ మైదానంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 125 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 45 ఓవర్లలో 4 వికెట్లకు 280 పరుగులు చేసింది. మురళీ విజయ్ (90 బంతుల్లో 90; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అపరాజిత్ (100 బంతుల్లో 91; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తొలి వికెట్‌కు 17 పరుగులకు జోడించాక సుశీల్ (10) అవుటైనా... విజయ్, అపరాజిత్లు రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. బద్రీనాథ్ (17) విఫలమైనా.. అనిరుధ (19 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), శంకర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) వేగంగా ఆడారు. అబ్బలం, రవి, ఆశిష్, సుమన్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత హైదరాబాద్ 35.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అక్షత్ రెడ్డి (62 బంతుల్లో 42; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆశిష్ రెడ్డి (31 బంతుల్లో 40 నాటౌట్; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 90/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్ చివరి ఏడు వికెట్లను 65 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఓ ఎండ్‌లో ఆశిష్ రెడ్డి ఒంటరిపోరాటం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. బాలాజీ, రాహిల్ షా చెరో మూడు వికెట్లు తీయగా, విఘ్నేష్, మహేశ్, అపరాజిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో తమిళనాడుకు 4 పాయింట్లు లభించాయి. స్కోరు వివరాలు తమిళనాడు ఇన్నింగ్స్: విజయ్ (సి అండ్ బి) సుమన్ 90; సుశీల్ (సి) అక్షత్ (బి) అబ్సలం 10; అపరాజిత్ (సి) అహ్మద్ (బి) ఆశిష్ 91; బద్రీనాథ్ (సి) అహ్మద్ (బి) రవి కిరణ్ 17; అనిరుధ నాటౌట్ 29; శంకర్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (45 ఓవర్లలో 4 వికెట్లకు) 280 వికెట్ల పతనం: 1-17; 2-159; 3-208; 4-208 బౌలింగ్: అబ్సలం 9-1-47-1; రవి కిరణ్ 9-0-56-1; ప్రజ్ఞాన్ ఓజా 10-0-59-0; ఆశిష్ రెడ్డి 8-0-68-1; అమోల్ షిండే 5-0-23-0; సుమన్ 4-0-21-1. హైదరాబాద్ ఇన్నింగ్స్: సుమన్ (బి) బాలాజీ 6; అక్షత్ రెడ్డి (సి) విఘ్నేష్ (బి) రాహిల్ షా 42; రవితేజ (బి) బాలాజీ 0; విహారి ఎల్బీడబ్ల్యు (బి) మహేశ్ 24; రాహుల్ సింగ్ (సి) విఘ్నేష్ (బి) రాహిల్ షా 18; అమోల్ షిండే (సి) సుశీల్ (బి) అపరాజిత్ 8; ఆశిష్ రెడ్డి నాటౌట్ 40; అహ్మద్ రనౌట్ 0; అబ్సలం ఎల్బీడబ్ల్యు (బి) రాహిల్ షా 2; ఓజా (బి) విఘ్నేష్ 1; రవి కిరణ్ (సి) విజయ్ (బి) బాలాజీ 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (35.5 ఓవర్లలో ఆలౌట్) 155 వికెట్ల పతనం: 1-6; 2-16; 3-64; 4-90; 5-98; 6-112; 7-112; 8-116; 9-119; 10-155 బౌలింగ్: బాలాజీ 5.5-1-27-3; విఘ్నేష్ 7-1-41-1; శంకర్ 3-0-11-0; మహేశ్ 5-0-30-1; రాహిల్ షా 9-1-32-3; అపరాజిత్ 6-1-14-1.