బెంగళూరు: బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ జట్టు సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పటిష్టమైన తమిళనాడు బౌలర్లను ఎదుర్కోలేక తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. దీంతో ఆదిత్య అకాడమీ మైదానంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 125 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 45 ఓవర్లలో 4 వికెట్లకు 280 పరుగులు చేసింది. మురళీ విజయ్ (90 బంతుల్లో 90; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అపరాజిత్ (100 బంతుల్లో 91; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు.
తొలి వికెట్‌కు 17 పరుగులకు జోడించాక సుశీల్ (10) అవుటైనా... విజయ్, అపరాజిత్‌లు రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. బద్రీనాథ్ (17) విఫలమైనా.. అనిరుధ (19 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), శంకర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) వేగంగా ఆడారు. అబ్బలం, రవి, ఆశిష్, సుమన్ తలా ఓ వికెట్ తీశారు.
తర్వాత హైదరాబాద్ 35.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది.
అక్షత్ రెడ్డి (62 బంతుల్లో 42; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆశిష్ రెడ్డి (31 బంతుల్లో 40 నాటౌట్; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 90/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్ చివరి ఏడు వికెట్లను 65 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఓ ఎండ్‌లో ఆశిష్ రెడ్డి ఒంటరిపోరాటం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. బాలాజీ, రాహిల్ షా చెరో మూడు వికెట్లు తీయగా, విఘ్నేష్, మహేశ్, అపరాజిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో తమిళనాడుకు 4 పాయింట్లు లభించాయి.
స్కోరు వివరాలు
తమిళనాడు ఇన్నింగ్స్: విజయ్ (సి అండ్ బి) సుమన్ 90; సుశీల్ (సి) అక్షత్ (బి) అబ్సలం 10; అపరాజిత్ (సి) అహ్మద్ (బి) ఆశిష్ 91; బద్రీనాథ్ (సి) అహ్మద్ (బి) రవి కిరణ్ 17; అనిరుధ నాటౌట్ 29; శంకర్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (45 ఓవర్లలో 4 వికెట్లకు) 280
వికెట్ల పతనం: 1-17; 2-159; 3-208; 4-208
బౌలింగ్: అబ్సలం 9-1-47-1; రవి కిరణ్ 9-0-56-1; ప్రజ్ఞాన్ ఓజా 10-0-59-0; ఆశిష్ రెడ్డి 8-0-68-1; అమోల్ షిండే 5-0-23-0; సుమన్ 4-0-21-1.
హైదరాబాద్ ఇన్నింగ్స్: సుమన్ (బి) బాలాజీ 6; అక్షత్ రెడ్డి (సి) విఘ్నేష్ (బి) రాహిల్ షా 42; రవితేజ (బి) బాలాజీ 0; విహారి ఎల్బీడబ్ల్యు (బి) మహేశ్ 24; రాహుల్ సింగ్ (సి) విఘ్నేష్ (బి) రాహిల్ షా 18; అమోల్ షిండే (సి) సుశీల్ (బి) అపరాజిత్ 8; ఆశిష్ రెడ్డి నాటౌట్ 40; అహ్మద్ రనౌట్ 0; అబ్సలం ఎల్బీడబ్ల్యు (బి) రాహిల్ షా 2; ఓజా (బి) విఘ్నేష్ 1; రవి కిరణ్ (సి) విజయ్ (బి) బాలాజీ 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (35.5 ఓవర్లలో ఆలౌట్) 155
వికెట్ల పతనం: 1-6; 2-16; 3-64; 4-90; 5-98; 6-112; 7-112; 8-116; 9-119; 10-155
బౌలింగ్: బాలాజీ 5.5-1-27-3; విఘ్నేష్ 7-1-41-1; శంకర్ 3-0-11-0; మహేశ్ 5-0-30-1; రాహిల్ షా 9-1-32-3; అపరాజిత్ 6-1-14-1.
హైదరాబాద్ పరాజయం
Published Sun, Mar 2 2014 11:44 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement