murli vijay
-
'అక్షర్ అద్భుతం చేశాడు'
రాజ్ కోట్: 'హ్యాట్రిక్' నమోదు చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ప్రశంసలు కురింపించాడు. అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... 'ఈ రోజు విజయం క్రెడిట్ అక్షర్ కు దక్కుతుంది. గత మ్యాచుల్లో అతడు ఒత్తిడికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని పేర్కొన్నాడు. ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో టాప్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను 'హ్యాట్రిక్' వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. మిల్లర్ ను తప్పించి విజయ్ కు కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అక్షర్ తో పాటు పేసర్లు మొహిత్ శర్మ, సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారని విజయ్ అన్నాడు. మిల్లర్ ఫామ్ గురించి అడగ్గా.. ఏ జట్టుకైనా అతడు ఎసెట్ అని పేర్కొన్నాడు. ఏడు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. -
వారెవ్వా... విజయ్
విదేశాల్లో మురళీ తొలి సెంచరీ భారత్ 259/4 ధోని అర్ధసెంచరీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఓపెనర్ మురళీ విజయ్ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో గౌరవప్రదంగా తొలిరోజును ముగించింది. నాటింగ్‌హామ్‌లో ఉపఖండం తరహా పిచ్ ఎదురుకావడం... ఇంగ్లండ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో ధోనిసేన ఆత్మవిశ్వాసం పెరిగింది. నాటింగ్‌హామ్: చాలా కాలం తర్వాత మురళీ విజయ్ టెస్టుల్లో సత్తా చాటుకున్నాడు. టాప్ ప్లేయర్లు విఫలమైన పిచ్‌పై అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసింది. విజయ్ (294 బంతుల్లో 122 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (64 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. విజయ్ నిలకడను చూపెట్టినా రెండో ఎండ్‌లో ధావన్ (24 బంతుల్లో 12) నిరాశపర్చాడు. అయితే పుజారా (69 బంతుల్లో 38; 7 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో లంచ్ వరకు భారత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కానీ లంచ్ తర్వాత అండర్సన్, బ్రాడ్ రివర్స్ స్వింగ్‌తో చెలరేగారు. ఒక పరుగు తేడాతో పుజారా, కోహ్లి (1) అవుట్ కావడంతో భారత్ 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయ్‌తో జత కలిసిన రహానే (81 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా భారీ స్కోరు చేయలేకపోయాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. టీ తర్వాత విజయ్ 214 బంతుల్లో కెరీర్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విదేశీ గడ్డపై తనకి ఇదే తొలి శతకం. ఆ తర్వాత ధోని సమయోచితంగా ఆడుతూ కాస్త దూకుడు చూపించి అర్ధసెంచరీ చేశాడు. అండర్సన్ 2 వికెట్లు తీయగా... బ్రాడ్, ప్లంకెట్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన స్టువర్ట్ బిన్నీ భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడుతున్న 281వ ఆటగాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ బ్యాటింగ్ 122; ధావన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12; పుజారా (సి) బెల్ (బి) అండర్సన్ 38; కోహ్లి (సి) బెల్ (బి) బ్రాడ్ 1; రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32; ధోని బ్యాటింగ్ 50; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 259. వికెట్ల పతనం: 1-33; 2-106; 3-107; 4-178 బౌలింగ్: అండర్సన్ 21-6-70-2; బ్రాడ్ 19-8-26-1; స్టోక్స్ 19-4-47-0; ప్లంకెట్ 21-4-56-1; అలీ 9-0-50-0; రూట్ 1-0-6-0. -
హైదరాబాద్ పరాజయం
బెంగళూరు: బ్యాటింగ్‌లో విఫలమైన హైదరాబాద్ జట్టు సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పటిష్టమైన తమిళనాడు బౌలర్లను ఎదుర్కోలేక తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. దీంతో ఆదిత్య అకాడమీ మైదానంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 125 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 45 ఓవర్లలో 4 వికెట్లకు 280 పరుగులు చేసింది. మురళీ విజయ్ (90 బంతుల్లో 90; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అపరాజిత్ (100 బంతుల్లో 91; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. తొలి వికెట్‌కు 17 పరుగులకు జోడించాక సుశీల్ (10) అవుటైనా... విజయ్, అపరాజిత్లు రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. బద్రీనాథ్ (17) విఫలమైనా.. అనిరుధ (19 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), శంకర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) వేగంగా ఆడారు. అబ్బలం, రవి, ఆశిష్, సుమన్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత హైదరాబాద్ 35.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అక్షత్ రెడ్డి (62 బంతుల్లో 42; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆశిష్ రెడ్డి (31 బంతుల్లో 40 నాటౌట్; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 90/3 స్కోరుతో ఉన్న హైదరాబాద్ చివరి ఏడు వికెట్లను 65 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఓ ఎండ్‌లో ఆశిష్ రెడ్డి ఒంటరిపోరాటం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. బాలాజీ, రాహిల్ షా చెరో మూడు వికెట్లు తీయగా, విఘ్నేష్, మహేశ్, అపరాజిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో తమిళనాడుకు 4 పాయింట్లు లభించాయి. స్కోరు వివరాలు తమిళనాడు ఇన్నింగ్స్: విజయ్ (సి అండ్ బి) సుమన్ 90; సుశీల్ (సి) అక్షత్ (బి) అబ్సలం 10; అపరాజిత్ (సి) అహ్మద్ (బి) ఆశిష్ 91; బద్రీనాథ్ (సి) అహ్మద్ (బి) రవి కిరణ్ 17; అనిరుధ నాటౌట్ 29; శంకర్ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (45 ఓవర్లలో 4 వికెట్లకు) 280 వికెట్ల పతనం: 1-17; 2-159; 3-208; 4-208 బౌలింగ్: అబ్సలం 9-1-47-1; రవి కిరణ్ 9-0-56-1; ప్రజ్ఞాన్ ఓజా 10-0-59-0; ఆశిష్ రెడ్డి 8-0-68-1; అమోల్ షిండే 5-0-23-0; సుమన్ 4-0-21-1. హైదరాబాద్ ఇన్నింగ్స్: సుమన్ (బి) బాలాజీ 6; అక్షత్ రెడ్డి (సి) విఘ్నేష్ (బి) రాహిల్ షా 42; రవితేజ (బి) బాలాజీ 0; విహారి ఎల్బీడబ్ల్యు (బి) మహేశ్ 24; రాహుల్ సింగ్ (సి) విఘ్నేష్ (బి) రాహిల్ షా 18; అమోల్ షిండే (సి) సుశీల్ (బి) అపరాజిత్ 8; ఆశిష్ రెడ్డి నాటౌట్ 40; అహ్మద్ రనౌట్ 0; అబ్సలం ఎల్బీడబ్ల్యు (బి) రాహిల్ షా 2; ఓజా (బి) విఘ్నేష్ 1; రవి కిరణ్ (సి) విజయ్ (బి) బాలాజీ 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (35.5 ఓవర్లలో ఆలౌట్) 155 వికెట్ల పతనం: 1-6; 2-16; 3-64; 4-90; 5-98; 6-112; 7-112; 8-116; 9-119; 10-155 బౌలింగ్: బాలాజీ 5.5-1-27-3; విఘ్నేష్ 7-1-41-1; శంకర్ 3-0-11-0; మహేశ్ 5-0-30-1; రాహిల్ షా 9-1-32-3; అపరాజిత్ 6-1-14-1. -
రెండో టెస్టు:భారత్ తొలి ఇన్నింగ్స్ 334
డర్బన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 334 పరుగులకే పరిమితమైంది. తొలిరోజు నిలకడగా ఆడి భారీ స్కోరు దిశగా పయనించిన భారత్, రెండో రోజు మాత్రం వరుస వికెట్లు కోల్పోయింది. ఒకవైపు భారత్ వికెట్లు కూలుతున్నా రహేనా(51) పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ థావన్ (29), మురళీ విజయ్ (97), పుజారా(70), కోహ్లి(46), ధోని (24) పరుగులు చేశారు. తొలి రోజు ధోనిసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.... రెండో రోజు సఫారీ బౌలింగ్ ముందు తేలిపోయారు. వికెట్టు నష్టానికి 181 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా అటాకింగ్ ముందు నిలకవలేక సతమతమైయ్యారు. భారత్ టాప్ ఆర్డర్ ను దక్షిణాఫ్రికా పేసర్లు కకావికలం చేశారు. దక్షిణా ఫ్రికా బౌలర్లలో స్టెయిన్ కు ఆరు వికెట్లు లభించగా, మోర్కెల్ మూడు వికెట్లు, డుమినీకి ఒక వికెట్టు లభించింది. -
పూర్తి ఆధిపత్యం
రెండో రోజు ఆట మధ్యాహ్నం గం. 1 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం సఫారీ పేసర్లు మరోసారి తేలిపోయారు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇబ్బందిపెట్టలేక రెండో టెస్టులోనూ చతికిలపడ్డారు. ధావన్ విఫలమైనా... ఫామ్‌లోకి వచ్చిన విజయ్, పుజారాతో కలిసి పరుగుల వరద పారించాడు. దీంతో తొలి రోజు ధోనిసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.... రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసిన ప్రొటీస్ బౌలర్లు కేవలం ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్నారు. డర్బన్: తొలి టెస్టు ఇచ్చిన ఆత్మ విశ్వాసాన్ని భారత కుర్రాళ్లు బాక్సింగ్ డే (రెండో) టెస్టులోనూ కొనసాగించారు. ప్రొటీస్ పేసర్ల మెరుపులను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్ ధావన్ (49 బంతుల్లో 29; 4 ఫోర్లు) విఫలమైనా... ఫామ్‌తో ఇబ్బందుపడుతున్న మురళీ విజయ్ (201 బంతుల్లో 91 బ్యాటింగ్; 17 ఫోర్లు) గాడిలో పడ్డాడు. వాండరర్స్ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (117 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో వికెట్ నష్టానికి 181 పరుగులు చేసింది. విజయ్, పుజారా క్రీజులో ఉన్నారు. బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్‌ను ముందుగా ఆపేశారు. దీంతో రెండో రోజు ఆట షెడ్యూల్ సమయాని కంటే అరగంట ముందు ప్రారంభమవుతుంది. కింగ్స్‌మీడ్ మైదానంలో మొదలైన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. అశ్విన్ స్థానంలో జడేజా భారత జట్టులోకి రాగా, తాహిర్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్‌కు సఫారీ తుది జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టులో గాయపడిన మోర్నీ మోర్కెల్ ఫిట్నెస్ సాధించి మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న కలిస్ ఫీల్డ్‌లోకి ముందు రాగా మిగతా జట్టు అతన్ని అనుసరించింది. టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధావన్ విఫలం ఎదుర్కొన్న రెండో బంతికి ఫోర్ కొట్టిన ధావన్ దూకుడును కనబరిస్తే... రెండో ఎండ్‌లో విజయ్ నిలకడగా ఆడాడు. తొలి రెండు ఓవర్లలో 10 పరుగులు రాబట్టిన ఈ జోడి నిలకడగా ఆడింది. స్టెయిన్, ఫిలాండర్ స్వింగ్ కోసం ప్రయత్నించినా... వికెట్ ఫ్లాట్‌గా ఉండటంతో బౌన్స్‌కు అనుకూలించింది. 8వ ఓవర్లోనే మోర్కెల్‌ను దించినా భారత ద్వయం మాత్రం బెదరలేదు. చూడచక్కని షాట్లతో అలరిస్తూ తొలి 13 ఓవర్లలో 41 పరుగులు రాబట్టింది. ఇక క్రీజులో కుదురుకున్నారనుకున్న దశలో మోర్కెల్ వేసిన అవుట్ స్వింగర్‌ను ఆడబోయి థర్డ్ స్లిప్‌లో పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన పుజారా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. అయితే ఒత్తిడి పెంచేందుకు 16వ ఓవర్లో కలిస్‌ను, 22వ ఓవర్లో స్పిన్నర్ పీటర్సన్‌ను బరిలోకి దించినా భారత ఆటగాళ్లు స్ట్రయిక్‌ను రొటేట్ చేసుకుంటూ వెళ్లారు. పుజారా నెమ్మదించినా... విజయ్ మాత్రం కలిస్, పీటర్సన్ బౌలింగ్‌లో బౌండరీలు బాదాడు. దీంతో ఈ సెషన్ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన ఈ జోడి 76/1 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. విజయ్ హవా లంచ్ తర్వాత వాతావరణం మేఘావృతమైనా... ప్రొటీస్ పేసర్లు మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో విజయ్ బౌండరీలతో స్కోరు బోర్డును పరిగెత్తిస్తే... పుజారా సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కలిస్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన విజయ్ 102 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత కూడా నిలకడగా ఆడిన ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ స్మిత్... తరచూ పేసర్లను మార్చినా ఫలితం లేకపోయింది. లంచ్ తర్వాత తొలి గంటలో భారత్ 13 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఫిలాండర్ బౌలింగ్‌లో వరుసగా రెండు అద్భుతమైన షాట్లతో చెలరేగిన విజయ్ 100 పరుగుల భాగస్వామ్యాన్నీ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో భారత్ కూడా 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. పీటర్సన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన పుజారా 97 బంతుల్లో అర్ధసెంచరీని సాధించాడు. ఈ సెషన్ మొత్తం భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆగిపోయిన మ్యాచ్ టీ తర్వాత వచ్చీ రావడంతోనే పీటర్సన్ బౌలింగ్‌లో విజయ్ ఎదురుదాడికి దిగాడు. రెండు ఓవర్లలో మూడు బౌండరీలు కొట్టి 90 పరుగులకు చేరుకున్నాడు. పుజారా కూడా విజయ్‌కే ఎక్కువగా బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు. రెండో ఎండ్‌లో స్టెయిన్‌ను కొనసాగించడంతో భారత ద్వయం ఆచితూచి ఆడింది. చివరకు 61వ ఓవర్ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) పీటర్సన్ (బి) మోర్కెల్ 29; విజయ్ బ్యాటింగ్ 91; పుజారా బ్యాటింగ్ 58; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 1, వైడ్లు 1, నోబాల్స్ 1) 3; మొత్తం: (61 ఓవర్లలో వికెట్ నష్టానికి) 181. వికెట్లపతనం: 1-41 బౌలింగ్: స్టెయిన్ 16-6-49-0; ఫిలాండర్ 14-4-39-0; మోర్కెల్ 12-3-26-1; కలిస్ 7-1-23-0; పీటర్సన్ 12-2-43-0. వాతావరణం అనుకూలిస్తుందా? రెండో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఇదే జోరును కొనసాగిస్తే మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా అనేది అనుమానమే. ఆటకు చివరి రెండు రోజులు (ఆది, సోమ) వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నివేదిక. డర్బన్‌లో బ్యాడ్‌లైట్ మామూలే. ఈ నేపథ్యంలో అరగంట ముందుగా ఆట ప్రారంభించినా ఎన్ని ఓవర్లు మేకప్ చేయగలరనేది పెద్ద ప్రశ్న. సెషన్-1 ఓవర్లు: 26 పరుగులు: 76 వికెట్లు: 1 సెషన్-2 ఓవర్లు: 27 పరుగులు: 87 వికెట్లు: 0 సెషన్-3 ఓవర్లు: 8 పరుగులు: 18 వికెట్లు: 0 1 భారత్ తరఫున వేగంగా 1500 పరుగులు (27 ఇన్నింగ్స్) చేసిన క్రికెటర్‌గా పుజారా