రెండో రోజు ఆట వర్షార్పణం
భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
బెంగళూరు: భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట రద్దయ్యింది. చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారడంతో కనీసం ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఉదయం 10 గంటలకు వర్షం కాస్త తెరిపినివ్వడంతో పదిన్నరకు మ్యాచ్‌ను మొదలుపెట్టాలని ప్రయత్నించారు. అయితే వెంటనే మొదలైన వాన మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆగకుండా కురిసింది.
దీంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు గౌల్డ్, కెటిల్‌బరో ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ నివేదిక. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే ఉదయం 9.15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌట్ కాగా...భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.