బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టును ఫతుల్లాలో నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢాకా నగరంలో ఫతుల్లా, మిర్పూర్ ప్రాంతాలలో రెండు స్టేడియాలు ఉన్నాయి. సాధారణంగా ఏ పెద్ద జట్టు వచ్చినా మిర్పూర్‌లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత్‌తో మూడు వన్డేలకు కూడా మిర్పూర్ స్టేడియం వేదిక. కానీ టెస్టు మ్యాచ్‌ను ఫతుల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవు. జూన్‌లో భారీ వర్షాలు ఉంటాయని తెలిసి కూడా సరైన సౌకర్యాలు లేని స్టేడియంను ఎందుకు ఎంచుకున్నారని బీసీసీఐ ప్రశ్నించినట్లు సమాచారం.
ఇక్కడి స్టేడియంలో కేవలం ఒక్క సూపర్ సాపర్ మాత్రమే ఉంది. దీంతో వర్షం ఆగినా స్టేడియంను సిద్ధం చేయడానికి సమయం పడుతోంది. మిర్పూర్‌లో సూపర్ సాపర్ యంత్రాలు చాలా ఉన్నాయి. కనీసం వాటిని ఇక్కడికి తీసుకొచ్చినా బాగానే ఉండేది. కానీ బీసీబీ ఇవేం చేయలేదు. కానీ బంగ్లా బోర్డు వాదన మరోలా ఉంది. మిర్పూర్‌తో పోలిస్తే ఫతుల్లాలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుందని, ఇక్కడ స్టేడియంను సిద్ధం చేయడానికి ఒక్క సూపర్‌సాపర్ సరిపోతుందని చెబుతోంది. అయితే భారీ వర్షం వల్ల తామేమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. మొత్తం మీద వర్షంతో పాటు సౌకర్యాల లేమి కూడా భారత్‌ను చిరాకు పరుస్తోంది.
బీసీబీపై భారత్ ఆగ్రహం
Published Sat, Jun 13 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement