మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా? | India cricketers wear mothers' names on their jerseys | Sakshi
Sakshi News home page

మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?

Published Sat, Oct 29 2016 6:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?

మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?

విశాఖపట్నం: న్యూజిలాండ్తో విశాఖపట్నంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత క్రికెటర్లు సరికొత్తగా కనిపించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సహా బ్యాటింగ్కు వచ్చిన క్రికెటర్ల జెర్సీలపై ఎప్పుడూ లేనివిధంగా కొత్త పేర్లు కనిపించాయి. సాధారణంగా క్రికెటర్లు ధరించే జెర్సీలపై వారి సొంత పేర్లు ఉంటాయి. విశాఖ మ్యాచ్లో మాత్రం భారత క్రికెటర్లందరి జెర్సీలపైనా మహిళల పేర్లు ఉన్నాయి. ఆటగాళ్ల జెర్సీపై ఉన్న పేరు వారి తల్లి పేరు. తమ జీవితాల్లో అమ్మకు ఉండే ప్రాధాన్యాన్ని చెప్పడానికి క్రికెటర్లు ఇలా చేశారు.

భారత క్రికెట్ బోర్డుతో కలసి స్టార్ ఇండియా చేపట్టిన మహిళల సాధికారిత ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్లు తమ తల్లి పేరును జెర్సీపై వేయించుకున్నారు. సామాజిక మార్పు కోసం ఓ టీమ్ జర్సీని వాడటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ చెప్పారు. తమ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన బీసీసీఐ, భారత క్రికెటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement