
భారత్‌కు రెండో స్థానం
న్యూఢిల్లీ: ఆసియా కప్ ట్రాక్ సైక్లింగ్ టోర్నమెంట్‌లో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి 16 పతకాలు లభించాయి. 18 పతకాలతో హాంకాంగ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.