హాకీలో అదరగొట్టిన అబ్బాయిలు.. | India in final of Commonwealth Games hockey | Sakshi
Sakshi News home page

హాకీలో అదరగొట్టిన అబ్బాయిలు..

Published Sat, Aug 2 2014 7:06 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

India in final of Commonwealth Games hockey

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ ఫైనల్లో ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన సెమీస్లో భారత్ 3-2తె న్యూజిలాండ్పై అద్భుత విజయం సాధించింది.

న్యూజిలాండ్ ఆటగాళ్లు సిమోన్, నిక్ హేగ్ చెరో గోల్ చేసి జట్టుకు 2-0 ఆధిక్యం అందించారు. అయితే ఆ తర్వాత భారత్ పుంజుకుని న్యూజిలాండ్ జోరుకు అడ్డుకట్ట వేసింది. ఆకాశ్దీప్ సింగ్, రమణ్దీప్ సింగ్, రూపిందర్ పాల్ తలా గోల్ చేసి భారత్ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. మరోవైపు భారత్ డిఫెండర్లు ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో భారత్ సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ ఆస్త్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్లో ఆస్ట్రేలియా 4-1తో ఇంగ్లండ్ను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement