తడబడిన భారత్ | , India in West Indies, 4 Test Series, 2016, 3rd Test | Sakshi
Sakshi News home page

తడబడిన భారత్

Published Wed, Aug 10 2016 3:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

తడబడిన భారత్

తడబడిన భారత్

భారత్ 130/5  రాహుల్ అర్ధసెంచరీ
వెస్టిండీస్‌తో మూడో టెస్టు

 గ్రాస్‌ఐలట్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. డారెన్ స్యామీ స్టేడియంలో మంగళవారం మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (65 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానే (133 బంతుల్లో 35; 4 ఫోర్లు) సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచినా పెద్దగా పరుగులు చేయలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (1), కోహ్లి (3) విఫలమయ్యారు.

రోహిత్ శర్మ (9) కూడా విఫలమయ్యాడు. అశ్విన్ (23 బ్యాటింగ్), సాహా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జోసెఫ్ రెండు వికెట్లు తీయగా... ఛేజ్‌కూ రెండు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. ఉమేశ్ స్థానంలో భువనేశ్వర్, పుజారా స్థానంలో రోహిత్, మిశ్రా స్థానంలో జడేజా తుది  జట్టులోకి వచ్చారు. టాస్ వెస్టిండీస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

 స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) బ్రాత్‌వైట్ (బి) ఛేజ్ 50; ధావన్ (సి) డౌరిచ్ (బి) గాబ్రియెల్ 1; కోహ్లి (సి) బ్రేవో (బి) జోసెఫ్ 3; రహానే (బి) ఛేజ్ 35; రోహిత్ శర్మ (సి) డౌరిచ్ (బి) జోసెఫ్ 9; అశ్విన్ బ్యాటింగ్ 23; సాహా బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (52 ఓవర్లలో 5 వికెట్లకు) 130.

 వికెట్ల పతనం: 1-9; 2-19; 3-77; 4-87; 5-126.

 బౌలింగ్: గాబ్రియెల్ 11-2-40-1, జోసెఫ్ 9-3-20-2, కమిన్స్ 10-4-28-0, హోల్డర్ 9-4-14-0, ఛేజ్ 11-4-15-2, బ్రాత్‌వైట్ 2-0-7-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement