
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో బుధవారం భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమి చవిచూసింది. యూరప్‌తో జరిగిన మూడో రౌండ్‌లో భారత్ 1.5–2.5తో... అనంతరం చైనాతో జరిగిన నాలుగో రౌండ్‌లో 1.5–2.5తో ఓడిపోయింది. యూరప్, చైనాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ తరఫున విదిత్ సంతోష్ పరాజయం పాలవ్వగా... విశ్వనాథన్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment