ఇంగ్లండ్‌ మహిళలతో టీ20లో భారత్‌ తడ‘బ్యాటు’ | India restricted to 111 Runs against England in 2nd T20 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ మహిళలతో టీ20లో భారత్‌ తడ‘బ్యాటు’

Published Thu, Mar 7 2019 12:44 PM | Last Updated on Thu, Mar 7 2019 12:47 PM

India restricted to 111 Runs against England in 2nd T20 - Sakshi

గువాహటి: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత మహిళలు మరోసారి తడబాటుకు గురయ్యారు. తొలి టీ20లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై ఓటమి చెందిన భారత మహిళల జట్టు.. రెండో టీ20లో కూడా అదే తరహా బ్యాటింగ్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల కోల్పోయి 111 పరుగులు చేశారు.

భారత బ్యాటర్స్‌లో మిథాలీ రాజ్‌ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మంధాన(12), హర్లీన్‌ డియాల్‌(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. ఐదుగురు క్రీడాకారిణులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రంట్‌ మూడు వికెట్లు సాధించగా, లిన్సే స్మిత్‌ రెండు వికెట్లు తీశారు. కేట్‌ క్రాస్‌, ష్రబ్‌సోల్‌లకు తలో వికెట్‌ దక్కింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ మహిళలు 41 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఇక్కడ చదవండి: పరాజయ  పరంపర  ఆగేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement