
సిడ్నీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్–అన్‌మోల్ జంట పసిడి పతకం సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌తో పాటు ఫైనల్లోనూ ఈ జంట ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. క్వాలిఫయింగ్‌లో 770 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచిన ఈ జోడీ... ఫైనల్లో 478.9 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. ఇదే విభాగంలో గౌరవ్ రాణా–మహిమా అగర్వాల్ (భారత్) జోడీ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది.
మను–అన్‌మోల్ ప్రదర్శనతో భారత్ ఖాతాలో ఏడో స్వర్ణం చేరడం విశేషం. మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో జెనెమత్ షెఖాన్ (భారత్) కాంస్యం సాధించింది. ఫైనల్లో ఆమె 36 పాయింట్లు స్కోరు చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అర్జున్ బబూటా–శ్రేయా అగర్వాల్ జంట మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. ఓవరాల్‌గా భారత్ ప్రస్తుతం ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 18 పతకాలతో రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment