డర్బన్: నాలుగు దేశాల అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 66 పరుగులతో నెగ్గి శుభారంభం చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సారథి ప్రియమ్ గార్గ్ (110; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో కదంతొక్కాడు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసి ఓడింది. భారత బౌలర్ సుశాంత్ మిశ్రా 4 వికెట్లతో రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment