భారత్‌ను గెలిపించిన రూపిందర్
మలేసియాపై విజయంతో అగ్రస్థానం
ఆసియా హాకీ చాంపియన్‌స ట్రోఫీ
క్వాంటన్ (మలేసియా): అందుబాటులో ఉన్న కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినప్పటికీ ఆసియా చాంపియన్‌స ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆతిథ్య మలేసియా జట్టుతో బుధవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. రూపిందర్ పాల్ సింగ్ (12వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. మలేసియా జట్టుకు రజీ రహీమ్ 18వ నిమిషంలో ఏకై క గోల్‌ను అందించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో రూపిందర్ 10 గోల్స్ చేయడం విశేషం. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్ నాలుగు విజయాలు, ఒక ‘డ్రా’తో కలిపి మొత్తం 13 పారుుంట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది.
ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో గురువారం చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక తెలుస్తుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం సెమీఫైనల్స్ జరుగుతారుు. గురువారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌తో చైనా; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతారుు. మలేసియా 9 పారుుంట్లతో రెండో స్థానంలో, కొరియా 7 పారుుంట్లతో మూడో స్థానంలో, 6 పారుుంట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉన్నారుు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం కొరియా లేదా పాకిస్తాన్‌తో భారత్ సెమీస్‌లో ఆడే అవకాశాలున్నారుు.
మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో చివరి 27 సెకన్లలో భారత్ పెనాల్టీ కార్నర్‌ను సమర్పించుకుంది. అరుుతే మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ డ్రాగ్ ఫ్లిక్ స్కూప్ షాట్‌ను భారత గోల్‌కీపర్ ఆకాశ్ నిలువరించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.