
టాస్ వేస్తున్న మార్క్‌రమ్
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లిసేన బరిలోకి దిగుతుండగా సఫారీ జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్‌తో ఖాయా జోండో అరంగేట్రం చేస్తున్నాడు. గాయంతో కెప్టెన్ డుప్లెసిస్ దూరం కాగా ఈ స్థానంలో జోండోను తుది జట్టులోకి ఎంపిక చేశారు. ఇక ఆలౌరౌండర్ పెహ్లుకువాయో స్థానంలో స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని ఎంపిక చేశారు. తాత్కలిక కెప్టెన్‌గా మార్క్‌రమ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. డర్బన్ వన్డే విజయంతో కోహ్లిసేన ఉత్సాహంగా ఉండగా కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్ తడబాటును ఎదుర్కొంటోంది.
తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్
దక్షిణాఫ్రికా : హషిమ్ ఆమ్లా, డికాక్, మార్క్‌రమ్, డుమిని, డేవిడ్ మిల్లర్, ఖాయా జోండో, క్రిస్ మొర్రిస్, రబడా,మోర్కెల్. తబ్రాజ్ షమ్సీ, ఇమ్రాన్ తాహిర్
Comments
Please login to add a commentAdd a comment