
ముంబై: టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌ల విచారణ మొదలైంది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి మంగళవారం వారితో ఫోన్‌లో మాట్లాడారు. అయితే కేవలం క్రికెటర్లు చెప్పింది మాత్రమే ఆయన విన్నారని... టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం, ఆ వ్యాఖ్యల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదని సమాచారం. ‘ఇది విచారణ ఆరంభం మాత్రమే కాబట్టి సంక్షిప్తంగానే వారి మాటలు విన్నారు. ఇంకా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తూ రాతపూర్వకంగా ఏం రాశారో కూడా చూడాల్సి ఉంది. బుధవారం ఆయన తన నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అంబుడ్స్‌మన్ నియామకం జరిగితేనే పూర్తి స్థాయి విచారణ ఇక ముందు కొనసాగుతుంది’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment