♦ మలేసియాపై ఘన విజయం
♦ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్ : ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో భారత జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో మలేసియాను చిత్తు చేసింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన మొదటి సింగిల్స్‌లో ప్రార్థనా తోంబరే 6-1, 6-0తో నబీలా బిన్తిని చిత్తు చేసింది. రెండో సింగిల్స్ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకితా రైనా 6-1, 3-6, 6-4తో జవైరియా నూర్‌దిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఏకంగా 2 గంటల 18 నిమిషాల పాటు సాగింది. డబుల్స్‌లో కూడా భారత్‌దే పైచేయి అయింది. ప్రార్థన-నటాషా జోడి 6-0, 6-2తో సెల్వరజూ-నబీలా బిన్తి జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కూడా సానియా మీర్జా బరిలోకి దిగలేదు.
భారత్ ప్రత్యర్థి తుర్క్‌మెనిస్తాన్
మరో వైపు ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, తుర్క్‌మెనిస్తాన్ జట్లు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఇండోనేసియా 3-0తో శ్రీలంకపై, తుర్క్‌మెనిస్తాన్ 3-0తో కిర్గిస్తాన్‌పై గెలుపొందాయి. సింగపూర్‌పై గెలిచి గ్రూప్ ‘ఎ’ నుంచి ఫిలిప్పీన్స్ తొలి రోజే ప్లే ఆఫ్ చేరింది. శుక్రవారం జరిగే తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తుర్క్‌మెనిస్తాన్‌తో భారత్... మరో మ్యాచ్‌లో ఇండోనేసియాతో ఫిలిప్పీన్స్ తలపడతాయి.
ప్లే ఆఫ్‌కు భారత్
Published Fri, Apr 17 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement