
ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఫ్రీస్టయిల్ పోటీల్లో విశాల్ కాళిరామన్ (70 కేజీలు), సచిన్ గిరి (79 కేజీలు), నవీన్ (57 కేజీలు) రజత పతకాలు గెలిచారు.
ఫైనల్స్‌లో విశాల్ 7–10తో అమీర్ హుస్సేన్ (ఇరాన్) చేతిలో... సచిన్ 0–10తో సజ్జాద్ సాబిర్‌అలీ (ఇరాన్) చేతిలో... నవీన్ 1–7తో అబ్దుల్లాయేవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కరణ్ 4–0తో పెర్మాన్ హోమదోవ్ (తుర్క్‌మెనిస్తాన్)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment