అలా అయితే ప్రపంచకప్‌ ఆడొద్దు! | Indians Call for World Cup Boycott After ICC Asks MS Dhoni to Remove Army Insignia Gloves | Sakshi
Sakshi News home page

#DhoniKeepTheGlove: ప్రపంచకప్‌ నుంచి వెనక్కొచ్చేయండి!

Published Fri, Jun 7 2019 11:53 AM | Last Updated on Fri, Jun 7 2019 12:01 PM

Indians Call for World Cup Boycott After ICC Asks MS Dhoni to Remove Army Insignia Gloves - Sakshi

#DhoniKeepTheGlove ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్న యాష్‌ట్యాగ్‌. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని కీపింగ్‌ గ్లౌజ్‌పై ఉన్న ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’  పై చర్చకు తెరలేపిన ట్యాగ్‌. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఉన్న ధోని..  ఆర్మీపై ఉన్న అభిమానం, ప్రేమ, అందులో చేరాలనే కోరికతో తన కీపింగ్‌ గ్లౌజ్‌పై ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్‌ ఆరంభపు మ్యాచ్‌లో ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అయితే ధోని గ్లౌజ్‌పై ఈ లోగో ఉండటాన్ని ఐసీసీ తప్పుబట్టింది. వెంటనే ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (కమ్యూనికేషన్స్‌) ఫర్లాంగ్‌ వెల్లడించారు.

అయితే భారత అభిమానులు మాత్రం బల్దియాన్‌ లోగో తీసే ముచ్చటే లేదని స్పష్టం చేస్తున్నారు. ‘ధోని ఆ లోగో అలానే ఉంచుకో.. దేశం మొత్తం నీకు మద్దతుగా ఉంది. అవసరమైతే ప్రపంచకప్‌నే బాయ్‌కాట్‌ చేద్దాం. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని కామెంట్‌ చేస్తున్నారు. ధోని గ్లోవ్‌ నుంచి ఆ సింబల్‌ తీసేయవచ్చేమో కానీ.. అతని గుండెలో నుంచి తీసేయలేరని, ఐసీసీ సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ లోగో విషయంలో ఐసీసీ ఒత్తిడి చేస్తే.. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి స్వచ్చందంగా నిష్క్రమించి మరో ఐపీఎల్‌ ఆడుకుందామని బీసీసీఐకి సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ధోని గ్లోవ్స్‌ నుంచి బల్దియాన్‌ లోగో తీసేస్తే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు వీక్షించవద్దని పిలుపునిస్తున్నారు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనంటున్నారు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement