విజేత రోజరీ కాన్వెంట్ | inter school games at secunderabad public school | Sakshi
Sakshi News home page

విజేత రోజరీ కాన్వెంట్

Published Sun, Jul 31 2016 2:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

విజేత రోజరీ కాన్వెంట్

విజేత రోజరీ కాన్వెంట్

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన రుక్మిణి బాయి ఇంటర్ స్కూల్ క్రీడల్లో రోజరీ కాన్వెంట్ జట్టు టేబుల్ టెన్నిస్ (టీటీ) సీనియర్, జూనియర్ బాలికల టీమ్ విభాగంలో విజేతగా నిలిచింది. జూనియర్ బాలికల ఫైనల్స్‌లో రోజరీ కాన్వెంట్ 2-0తో సెయింట్ పాల్స్ హైస్కూల్‌పై గెలిచింది. జూనియర్ బాలుర విభాగంలో చిరెక్ స్కూల్ 2-0తో సెయింట్ పాల్స్ హైస్కూల్‌పై నెగ్గింది.

సీనియర్ బాలుర విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ 2-1తో బీవీబీ జూబ్లీహిల్స్‌పై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్ రాజు, మాజీ టేబుల్ టెన్నిస్ ఆటగాడు లలిత్ మోహన్ చందన హాజరయ్యారు.  

టీటీ వ్యక్తిగత విభాగం విజేతలు: జూనియర్ బాలురు: 1. వేణు (గీతాంజలి దేవ ర్షి), 2. ప్రణవ్ నల్లారి (చిరెక్ స్కూల్); సీనియర్ బాలురు: 1. సాయి ధనుష్ (భారతీయ విద్యా భవన్స్ స్కూల్), 2.రితీస్ థామస్ (కెన్నడీ హైస్కూల్). జూనియర్ బాలికలు: 1. పలక్ (గీతాంజలి దేవర్షి), 2. విధి (గీతాంజలి దేవర్షి); సీనియర్ బాలికలు: 1. రమ్య (సెయింట్ ఆంథోని హైస్కూల్), 2. అంజలి (గీతాంజలి దేవర్షి).
 

క్యారమ్స్ విజేతలు: జూనియర్ బాలికలు: 1.మేఘన (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్), 2. సమత (హిందు పబ్లిక్ స్కూల్); సీనియర్ బాలికలు: 1. అశ్విన్ (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్), 2. ఆద్య (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్); సీనియర్ బాలురు: 1. అబ్దుల్ హఫీజ్ (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్), 2. కె. జయంత్ (ఆర్‌టీ హెచ్‌ఎస్); జూనియర్ బాలురు: 1.మణిదీప్ (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్), 2. మానవ్ మల్లు (సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్).  

చెస్ విజేతలు: జూనియర్ బాలికలు: 1. జి. శ్రీశాంతి (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్), 2. సాయి చరిత (ఫాస్టర్ బిల్లాబాంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్); సీనియర్ బాలికలు: 1. ప్రకాశిత (డీఏవీ), 2. సంజన (సెయింట్ ఆండ్రూస్, బోయిన్‌పల్లి); జూనియర్ బాలురు: 1. కునాల్ (భారతీయ విద్యా భవన్స్ స్కూల్), 2. విఘ్నేశ్ రామస్వామి (ఆర్మీ పబ్లిక్ స్కూల్); సీనియర్ బాలురు: 1. కృష్ణ కల్యాణ్ (హిందు పబ్లిక్ స్కూల్), 2. శరవణ్ రెడ్డి (సెయింట్ ఆన్స్ గ్రామర్ స్కూల్).
 

Advertisement

పోల్

Advertisement