
కరాచీ: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్)పై మరో పిడుగు పడింది. ప్రో లీగ్ టోర్నమెంట్‌కు జాతీయ జట్టును పంపకుండా పాకిస్తాన్ హాకీ సమాఖ్య నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) భారీ జరిమానా విధించింది. జూన్ 20లోగా లక్షా 70 వేల యూరోలు (పాక్ కరెన్సీలో రూ. 2 కోట్ల 71 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది.
లేని పక్షంలో దానికి రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై స్పందించిన పీహెచ్‌ఎఫ్ అంత భారీ జరిమానాను చెల్లించలేమని పేర్కొంది. జరిమానా తగ్గించడంతో పాటు విడతల వారీగా చెల్లించే వెసులుబాటు కల్పించాలని ప్రపంచ సమాఖ్యకు విజ్ఞప్తి చేసినట్లు పాకిస్తాన్ సమాఖ్య కార్యదర్శి షాబాజ్ అహ్మద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment