దుబాయ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లా.? | IPL 2019 Most Likely To Move To UAE | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 25 2018 8:51 PM | Last Updated on Wed, Apr 25 2018 10:12 PM

IPL 2019 Most Likely To Move To UAE - Sakshi

ఐపీఎల్‌ ట్రోఫితో కెప్టెన్లు (ఫైల్‌ ఫొటో)

ముంబై : వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)ను దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. దేశంలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో 2019 ఐపీఎల్‌ను దుబాయ్‌కి తరలించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 12వ సీజన్‌ ఐపీఎల్‌ మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణ కష్టంగా మారనుంది.

ఐపీఎల్‌ను తరలించే పరిస్థితులు ఏర్పడితే దానికి తాము సిద్దంగా ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఒకవేళ ఐపీఎల్‌ తరలించాల్సి వస్తే భారత ప్రజలు ఎక్కువగా ఉండే దుబాయ్‌కి తరలిస్తామన్నారు. ఇక గతంలో రెండు సార్లు ఐపీఎల్‌ను ఇతర దేశాల్లో నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికలతో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఎన్నికలతో  యూఏఈలో నిర్వహించారు. ఇ​క యూఏఈలో దుబాయ్‌, అబుదాబి, షార్జాలతో మొత్తం మూడు వేదికలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement