ఏసెస్ అదుర్స్
మనీలా మావెరిక్స్‌పై 26-25తో విజయం
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)ను ఇండియన్ ఏసెస్ విజయంతో ఆరంభించింది. శనివారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మనీలా మావెరిక్స్‌తో హోరాహోరీగా సాగిన పోరులో ఏసెస్ 26-25 పాయింట్ల తేడాతో గట్టెక్కింది. ఆరంభంలో వెనుకబడినప్పటికీ చివర్లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో అభిమానులను అలరించింది.
ఈ విజయంతో 24 పాయింట్లతో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా 5-6తో డానియల్ నెస్టర్, కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పురుషుల లెజెండ్ సింగిల్స్‌లోనూ సెడ్రిక్ పియొలైన్ 4-6తో మార్క్ ఫిలిప్పోసిస్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఏసెస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే కీలక పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-గేల్ మోన్‌ఫిల్స్ 6-5తో జో విల్‌ఫ్రెడ్ సోంగా-ట్రీట్ హుయేపై నెగ్గి జోష్ నింపారు.
కానీ పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 4-6తో సోంగా చేతిలో ఓడిపోయాడు. అయితే మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ సూపర్ షోతో 6-2తో ఫ్లిప్‌కెన్స్‌పై నె గ్గడంతో ఇరు జట్లు చెరి 25 పాయింట్లతో సమాన ంగా నిలిచాయి. దీంతో ఏడు నిమిషాలపాటు జరిగిన సూపర్ షూటౌట్‌లో ఏసెస్ తరఫున మోన్‌ఫిల్స్ 1-0తో సోంగాపై నెగ్గి జట్టులో ఆనందం నింపాడు. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-16 తేడాతో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది.