జోఫ్రా ఆర్చర్
ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్‌లు అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? అనే సందేహాన్ని కలిగించాయి. తాజాగా ఐర్లాండ్‌తో నాలుగు రోజుల టెస్ట్ సందర్భంగా కూడా మరోసారి అతని పాత ట్వీట్‌లు చర్చనీయాంశమయ్యాయి. 2013లో చేసిన ట్వీట్‌లలో ఆర్చర్ చెప్పినట్లు ఇప్పుడు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘6 బంతులు16 పరుగులు’ అని చేసిన ట్వీట్ ప్రపంచకప్ అనంతరం చర్చకు దారీ తీసింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌లో 15 పరుగులు చేసింది.. న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే 2014లో లార్డ్స్‌కు వెళ్తున్నాం.. 2015లో సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదని ట్వీట్ చేశాడు. ఇవి కూడా ప్రపంచకప్ ఫైనల్ పరిస్థితులనే తలపించాయి.
2015లో ‘ఐర్లాండ్ లుకింగ్ గుడ్’ అని చేసిన ట్వీట్ మరోసారి ఈ తరహా చర్చకు దారితీసింది. బుధవారం నుంచి ప్రారంభమైన నాలుగు రోజుల టెస్ట్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 85 పరుగులకే కుప్పకూల్చింది. అయితే ఇది ఊహించే ఆర్చర్ 2015లో ట్వీట్ చేశాడా? అని అభిమానులు మళ్లీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్‌ను క్రికెట్ ఐర్లాండ్ రీట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఆర్చర్ నీ దగ్గర ఏమైనా టైం మిషన్ ఉందా? అని ఒకరు.. ‘ఆర్చర్ జ్యోతిష్యం చెప్పరాదు’ అని మరొకరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్)
— Cricket Ireland (@Irelandcricket) July 24, 2019
Comments
Please login to add a commentAdd a comment