న్యూఢిల్లీ: ఒక మెగా టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉంటే ఆ ఆనందమే వేరు. తుది జట్టులో లేకపోయినా రిజర్వ్ ఆటగాళ్లలో ఉండి ఒక గొప్ప విజయంలో భాగమైతే దాన్ని కూడా బాగానే ఆస్వాదిస్తాం. 2011లో టీమిండియా రెండో సారి వరల్డ్‌కప్‌ను గెలిచి నిన్నటి(ఏప్రిల్ 2))కి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ క్షణాల్ని ఆ జట్టులో సభ్యులైన ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఆ ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా అపూర్వ విజయం తర్వాత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను తోటి ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం అంతా ఊరేగారు. అందులో యూసఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. (ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ గెలవలేదు!)
తమ పెద్ద సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ తుది జట్టులో ఆడితే, యూసఫ్ రిజర్వ్ బెంచ్‌లో ఉన్నాడు. కాకపోతే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సచిన్‌ను భుజాలపై ఎత్తుకుంది మాత్రం యూసప్ పఠాన్. దీన్ని తాజాగా షేర్ చేసుకున్నాడు యూసఫ్. ‘ఆ అరుదైన సందర్భం జరిగి అప్పుడే ఇన్ని ఏళ్లు అయ్యిందా.. నాకు నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. అదొక స్పెషల్ నైట్. అది ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ చారిత్రక ఘట్టంలో భాగమైనందకు చాలా గర్వంగా ఉంది’ అని యూసఫ్ ట్వీట్ చేశాడు. దీనికి సచిన్‌ను ఎత్తుకున్న ఫొటోను కూడా జత చేశాడు.(మమ్మల్ని ఎందుకు మరిచావ్?: యువీ)
శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. లంకేయులు నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్ ఛేదనలో భాగంగా సచిన్ టెండూల్కర్(18), వీరేంద్ర సెహ్వాగ్(0)లు నిరాశపరిచినా, గౌతం గంభీర్(97) తృటిలో సెంచరీ కోల్పోగా, ఎంఎస్ ధోని(91 నాటౌట్)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషిస్తే, విరాట్ కోహ్లి(35), యువరాజ్(21 నాటౌట్)లు తమ వంతు పాత్ర పోషించారు.
9 years to the historic World Cup win and it seems like it happened just yesterday. That special night was unforgettable. Grateful to be a part of Indian cricket's historic moment. #memories pic.twitter.com/vJGMVngXDS
— Yusuf Pathan (@iamyusufpathan) April 2, 2020
Comments
Please login to add a commentAdd a comment