డివిలియర్స్ ఫామ్లో లేకపోతే.. | It's tough when AB de Villiers doesn't perform | Sakshi
Sakshi News home page

డివిలియర్స్ ఫామ్లో లేకపోతే..

Published Sat, Jun 10 2017 3:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

డివిలియర్స్ ఫామ్లో లేకపోతే..

డివిలియర్స్ ఫామ్లో లేకపోతే..

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఫామ్ లేకపోవడంపై ఆ జట్టు స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ స్పందించాడు. ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన డివిలియర్స్ నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.  పాకిస్తాన్ తో మ్యాచ్ లో డకౌట్ కాగా,  శ్రీలంకతో మ్యాచ్ లో నాలుగు పరుగులతో నిరాశపరిచాడు.

 

అయితే ఏబీ ఫామ్ లేకపోవడం అనేది తాత్కాలికమంటూ అతనికి మద్దతుగా నిలిచాడు మిల్లర్. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన ఏబీ ఫామ్ లేకపోవడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుందని పేర్కొన్నాడు. ఒకవేళ డివిలియర్స్ వైఫల్యం చెందిన పక్షంలో అది తమ జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని మిల్లర్ స్పష్టం చేశాడు.

 

'డివీ ఫామ్ లో లేకపోతే అది మాకు కష్టంగానే ఉంటుంది. డివీ విఫలం కావడం అనేది చాలా అరుదు. డివిలియర్స్ కెరీర్ లో ఎక్కువసార్లు విఫలమైన సందర్భాలను నేను చూడలేదు. దక్షిణాఫ్రికా జట్టులో  ఏబీ కీలక ఆటగాడు. ప్రస్తుతం ఏబీ ఫామ్ లేకపోవడం అనేది తాత్కాలికమే. అది మాకు సమస్యగా భావించడం లేదు. పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ ల్లో ఏబీని దురదృష్టం వెంటాడింది. దాంతోనే అతను తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆదివారం భారత్ తో జరిగే పోరుకు ఏబీ పూర్వపు ఫామ్ తో చెలరేగుతాడని ఆశిస్తున్నా'అని మిల్లర్ తెలిపాడు. రేపు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకూ కీలకమే. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. దాంతో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement