బెంగళూరుపై జైపూర్ గెలుపు | Jaipur wins Pro Kabaddi League | Sakshi
Sakshi News home page

బెంగళూరుపై జైపూర్ గెలుపు

Published Sun, Feb 21 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

బెంగళూరుపై జైపూర్ గెలుపు

బెంగళూరుపై జైపూర్ గెలుపు

జైపూర్: సొంత వేదికపై జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భా గంగా శనివారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 30-21 తేడాతో నెగ్గింది. తొలి అర్ధ భాగం వరకు బెంగళూరు గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత జైపూర్ చకచకా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం ప్రదర్శించింది. ఆతిథ్య జట్టు నుంచి జస్వీర్ 5, రాజేశ్ నర్వాల్ 3 రైడింగ్ పాయిం ట్లతోపాటు 4 టాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు నుంచి పవన్ కుమార్ ఐదు రైడింగ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 32-22 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement