మొమోటా @10 | Japan Star Kento Momota Defends Fuzhou Crown For 10th Title This Year | Sakshi
Sakshi News home page

మొమోటా @10

Published Mon, Nov 11 2019 5:40 AM | Last Updated on Mon, Nov 11 2019 5:40 AM

Japan Star Kento Momota Defends Fuzhou Crown For 10th Title This Year - Sakshi

ఫుజౌ (చైనా): జపాన్‌ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కెంటో మొమోటా ఈ ఏడాది పదో సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోరీ్న ఫైనల్లో మొమోటా 21–15, 17–21, 21–18తో చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీ చోంగ్‌ వీ (మలేసియా–2010లో 9 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును మొమోటా బద్దలు కొట్టాడు. ఈ ఏడాది మరో టైటిల్‌ సాధిస్తే మొమోటా ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం జియోలి వాంగ్‌–యు యాంగ్‌ (చైనా–మహిళల డబుల్స్‌లో 10 టైటిల్స్‌; 2011లో) ద్వయం పేరిట ఉన్న రికార్డును మొమోటా సమం చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement