జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన రాజస్తాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్ప్‌తో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఉత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా వికెట్‌ను తన తొలి ఐపీఎల్ వికెట్‌గా ఆర్చర్ ఖాతాలో వేసుకున్నాడు. 19 ఓవర్ తొలి బంతికి కృనాల్ ఔట్ చేసిన ఆర్చర్..ఆపై నాలుగు, ఐదు బంతుల్లో వరుసగా హార్దిక్ పాండ్యా, మెక్లీన్‌గన్‌లను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.
ఫలితంగా రాజస్తాన్ తరపున అరంగేట్రం చేసి మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన మూడో బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. అంతకుముందు రాజస్తాన్ తరపున అరంగేట్ర చేసి మెరిసిన బౌలర్లలో అమిత్ సింగ్( 2009లో కింగ్స్ పంజాబ్‌పై) 9 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించగా, అటు తర్వాత కెవిన్ కూపర్(2012లో కింగ్స్ పంజాబ్‌పై) 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఆ ఇద్దరి తర్వాత స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో ఆర్చర్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment