సిడ్నీ: టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఇప్పుడైతే ఎలాంటి డెడ్‌లైన్లు లేవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కో ఆర్డినేషన్ కమిషన్ అధికారి జాన్ కోట్స్ తెలిపారు. జూలై 24 నుంచి జరిగే మెగా ఈవెంట్ కోసం మే నెలాఖరులోగా అన్ని క్వాలిఫికేషన్ టోర్నీలు ముగియాలనే గడువు విధించారు. అయితే ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి కాటేయడంతో దాదాపు అన్ని దేశాల్లోనూ క్వాలిఫయింగ్ టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహిస్తారా లేదా అనే నిర్ణయం తీసుకునేందుకు తుదిగడువు లేదని కోట్స్ స్పష్టం చేశారు. ఆసీస్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కూడా అయిన కోట్స్ ఒలింపిక్స్ పనుల మీద యూరప్ చుట్టివచ్చాడు. అయితే అతను స్వదేశం (ఆస్ట్రేలియా) చేరాక ప్రస్తుత నిబంధనల మేరకు ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా 14 రోజుల ఐసోలేషన్ వార్డులో చేరాల్సి ఉంటుంది.
ఆ వేడుకను ముగించారు...
ఒలింపిక్స్ సంప్రదాయం ప్రకారం ఏథెన్స్‌లో నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమా న్ని తూతూ మంత్రంగా ముగించేశారు. కోవిడ్–19 వల్లే గ్రీకు ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుంది. అక్కడ 331 మంది వైరస్ బారిన పడగా... నలుగురు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment