International Committee
-
పోలవరాన్ని నిండా ముంచింది చంద్రబాబేనన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ
-
చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి
వాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడిచేసేందుకు అమెరికా సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఎనిమిది దేశాల్లోని 19 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కూటమి తమ తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక నిర్ణయాలు తీసుకునేవైపు ప్రయత్నాలు కొనసాగించనున్నాయి. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని నియంత్రించే నేషనల్‌సెక్యూరిటీ లెజిస్లేషన్ని అమెరికా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే సహా యూరోపియన్ పార్లమెంటు సభ్యులతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. అమెరికా సెనేటర్ మార్కో రుబియో, డెమొక్రాట్ బాబ్ మెనెండేజ్, జపాన్ మాజీ రక్షణ మంత్రి జెన్ నకటానీ, యూరోపియన్ పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులు మిరియం లెక్స్మాన్, ప్రముఖ యూకే కన్సర్వేటివ్ చట్టసభ్యులు లైన్ డన్కన్ స్మిత్‌లు కూటమిలో సభ్యులుగా ఉన్నారు. కమ్యూనిస్టు పాలనలో చైనా ప్రపంచానికే పెను సవాల్‌గా మారిందంటూ తరచూ చైనాని విమర్శించే అమెరికన్ సెనేటర్ రుబియో వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు. హాంకాంగ్ విషయం తమ అంతర్గత విషయమని చైనా పదే పదే నొక్కి చెపుతోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ నిబంధనలూ, సంబంధాలను సరిగ్గా అర్థం చేసుకోవాలనీ, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తమ దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనీ చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
ఎలాంటి డెడ్‌లైన్ లేదు
సిడ్నీ: టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఇప్పుడైతే ఎలాంటి డెడ్లైన్లు లేవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కో ఆర్డినేషన్ కమిషన్ అధికారి జాన్ కోట్స్ తెలిపారు. జూలై 24 నుంచి జరిగే మెగా ఈవెంట్ కోసం మే నెలాఖరులోగా అన్ని క్వాలిఫికేషన్ టోర్నీలు ముగియాలనే గడువు విధించారు. అయితే ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి కాటేయడంతో దాదాపు అన్ని దేశాల్లోనూ క్వాలిఫయింగ్ టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహిస్తారా లేదా అనే నిర్ణయం తీసుకునేందుకు తుదిగడువు లేదని కోట్స్ స్పష్టం చేశారు. ఆసీస్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కూడా అయిన కోట్స్ ఒలింపిక్స్ పనుల మీద యూరప్ చుట్టివచ్చాడు. అయితే అతను స్వదేశం (ఆస్ట్రేలియా) చేరాక ప్రస్తుత నిబంధనల మేరకు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా 14 రోజుల ఐసోలేషన్ వార్డులో చేరాల్సి ఉంటుంది. ఆ వేడుకను ముగించారు... ఒలింపిక్స్ సంప్రదాయం ప్రకారం ఏథెన్స్లో నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమా న్ని తూతూ మంత్రంగా ముగించేశారు. కోవిడ్–19 వల్లే గ్రీకు ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుంది. అక్కడ 331 మంది వైరస్ బారిన పడగా... నలుగురు మృతి చెందారు. -
వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టం!
స్టాక్‌హోం: సముద్రపు నీటిమట్టం ఆరేళ్ల క్రితం అనుకున్న దానికన్నా వేగంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ మార్పుపై అంతర్జాతీయ కమిటీ (ఐపీసీసీ) నిర్థారణకు వచ్చింది. ప్రపంచ దేశాల ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కూడిన ఐపీసీసీ భూతాపోన్నతి వల్ల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, నివేదికలను వెలువరిస్తూ ఉంటుంది. 2100 నాటికి సముద్రపు నీటిమట్టం 18 నుంచి 59 సెంటీమీటర్ల ఎత్తును పెరిగే అవకాశం ఉందని 2007లో ఐపీసీసీ నాలుగో నివేదికలో అంచనా వేసింది. ఈ నివేదికకు నోబెల్ బహుమతి కూడా దక్కింది. అయితే, అప్పుడు అనుకున్నదానికన్నా అధికంగా 26 నుంచి 81 సెంటీమీటర్ల ఎత్తున సముద్రపు నీటి మట్టం పెరగనున్నదని, ఫలితంగా కోస్తా తీరప్రాంతాలకు ముంపు ముప్పు అనుకున్నదానికన్నా అధికంగా ఉంటుందని ఐపీసీసీ తాజాగా అంచనా వేసింది.