మనమే కబడ్డీ కింగ్స్
• వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా భారత్
• ఫైనల్లో ఇరాన్‌పై 38-29తో విజయం
• ప్రపంచ వేదికపై మన ‘కూత’ మార్మోగింది...
• కబడ్డీపై మన ‘పట్టు’ మరింత బిగిసింది...
ప్రొ కబడ్డీ లీగ్‌తో స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు... ప్రపంచకప్‌లోనూ గర్వంగా తొడకొట్టారు. టోర్నీ ప్రారంభంలోనే కాకుండా... ఫైనల్ పోరులోనూ ఆరంభంలో తడబడ్డా... అద్భుతంగా పోరాడి అదరగొట్టారు. అజయ్ ఠాకూర్ సంచలన రైడింగ్‌తో భారత జట్టు సగర్వంగా కబడ్డీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.
అభినందనల వెల్లువ
కబడ్డీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి విజయ్ గోయెల్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు జట్టును అభినందించారు. క్రీడాకారులు హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్, జ్వాల కూడా జట్టును ప్రశంసించారు.
అహ్మదాబాద్: కబడ్డీ కూతలో తమకు ఎదురులేదని భారత్ నిరూపించింది. వరుసగా మూడోసారి విశ్వవిజేతగా అవతరించి... హ్యాట్రిక్ కొట్టింది. శనివారం జరిగిన ప్రపంచ కప్ కబడ్డీ ఫైనల్లో భారత్ 38-29 పారుుంట్ల తేడాతో ఇరాన్‌పై గెలిచింది. 2004, 2007 ప్రపంచ కప్ టోర్నీల్లోనూ భారత్ చాంపియన్‌గా నిలువగా... ఆ రెండు టోర్నీ ఫైనల్స్‌లోనూ ఇరాన్ ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచింది. స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుతంగా ఆడి 12 పారుుంట్లు సాధించి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల అజయ్ ఈ టోర్నీలో ఓవరాల్‌గా 64 పారుుంట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆరంభంలో తడబాటు
భారత్‌కే చెందిన స్పోర్‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ కేసీ సుథార్ పర్యవేక్షణలో ప్రపంచకప్‌కు సిద్ధమైన ఇరాన్ మూడోసారైనా కప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో తుదిపోరులో బరిలోకి దిగింది. సందీప్ నర్వాల్, అజయ్ ఠాకూర్ విజయవంతమైన రైడింగ్‌తో భారత్ ఆరంభంలో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇరాన్ ఆటగాళ్లు వరుసగా మూడు రైడింగ్ పారుుంట్లు నెగ్గి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండు జట్ల ఆటగాళ్లు పట్టుదలగా పోరాడటంతో పలుమార్లు స్కోరు సమమైంది.
12వ నిమిషంలో ఇరాన్ స్టార్ ప్లేయర్ మిరాజ్ షేక్ రైడింగ్‌లో రెండు పారుుంట్లు సాధించడంతో ఇరాన్ 9-7తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఒత్తిడిలో ఆడుతున్నట్లు కనిపించిన భారత ఆటగాళ్లు అటు రైడింగ్‌లో, ఇటు ట్యాక్లింగ్‌లో తడబడ్డారు. తొలి అర్ధభాగం చివరి నిమిషాల్లో భారత్‌ను ఆలౌట్ చేసిన ఇరాన్ విరామ సమయానికి 18-13తో ఆధిక్యంలో నిలిచింది.
అజయ్ అదుర్స్
రెండో అర్ధభాగంలో భారత్ పుంజుకుంది. రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుత కదలికలతో ఇరాన్ ఆటగాళ్లను అవుట్ చేశాడు. రైడింగ్‌కు వెళ్లిన ఐదుసార్లూ అజయ్ పారుుంట్లతో తిరిగి వచ్చాడు. దాంతో భారత్ 30వ నిమిషంలో 21-20తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ వెంటనే ఇరాన్‌ను ఆలౌట్ చేసిన భారత్ 24-21తో తమ ఆధిక్యాన్ని మూడు పారుుంట్లకు పెంచుకుంది. భారత ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరిగింది.
రైడింగ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు తడబడటం... అజయ్ ఠాకూర్ రైడింగ్‌లో చెలరేగడంతో భారత్ రెండోసారి ఇరాన్‌ను ఆలౌట్ చేసి 34-24తో తమ ఆధిక్యాన్ని 10 పారుుంట్లకు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. అజయ్ ఠాకూర్‌తోపాటు రైడింగ్‌లో నితిన్ తోమర్ (6 పారుుంట్లు), సందీప్ నర్వాల్, అనూప్ కుమార్, సుర్జీత్ (3 పారుుంట్లు చొప్పున) రాణించారు. ‘ఎమర్జింగ్ టీమ్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు కెన్యా జట్టుకు దక్కగా... అత్యంత విలువైన క్రీడాకారుడు పురస్కారం జాంగ్ కున్ లీ (దక్షిణ కొరియా)కు లభించింది.