కశ్యప్ కూడా బెంగళూరుకు... | Kashyap also in Bangalore ... | Sakshi
Sakshi News home page

కశ్యప్ కూడా బెంగళూరుకు...

Published Thu, Aug 25 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

కశ్యప్ కూడా బెంగళూరుకు...

కశ్యప్ కూడా బెంగళూరుకు...

ప్రత్యేక శిక్షణ తీసుకోనున్న షట్లర్


న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్ బాటలోనే భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ కూడా హైదరాబాద్‌నుంచి బెంగళూరుకు మకాం మార్చాడు. రాబోయే కొన్ని నెలల పాటు అతను కోచ్ టామ్ జాన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటాడు. కొద్ది రోజులుగా మోకాలి గాయంతో బాధపడుతున్న కశ్యప్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. గాయం కారణంగానే అతను రియో ఒలింపిక్స్ అర్హత టోర్నీలకు దూరమయ్యాడు. ‘మోకాలి గాయం తర్వాత నా ఆట ఆశించిన స్థాయిలో లేదు. రియో అవకాశం కోల్పోవడం కూడా నిరాశపర్చింది. అందుకే కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించాను.


అదే ఆలోచనతో టామ్ జాన్ అకాడమీలో శిక్షణ తీసుకోబోతున్నాను. బెంగళూరులోనే ఫిజియో డెక్‌లైన్ లీటావో సహాయం కూడా తీసుకుంటాను’ అని కశ్యప్ చెప్పాడు. ఇండోనేసియా, జపాన్, కొరియా టోర్నీల తర్వాత తాను హైదరాబాద్‌కు తిరిగి వస్తానని అతను వెల్లడించాడు. 2014 ఆసియా క్రీడలకు ముందు సైనా నెహ్వాల్ కూడా గోపీచంద్ అకాడమీని వదిలి ప్రస్తుతం బెంగళూరులోనే విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement