
రెండో రౌండ్ లో కశ్యప్ ఓటమి
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ నిష్ర్కమించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో కశ్యప్13-21, 20-22 తేడాతో లిన్ యు సెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ను ఎటువంటి ప్రతిఘటన లేకుండా కోల్పోయిన కశ్యప్ ... రెండో గేమ్లో పోరాడి ఓడాడు. ఇదిలా ఉండగా, మహిళల సింగిల్స్ పోరులో సైనా నెహ్వాల్ క్వార్టర్స్ కు చేరింది.
ప్రి క్వార్టర్ ఫైనల్లో సైనా 17-21, 21-18, 21-12 తేడాతో దినార్(ఇండోనేషియా)పై గెలిచింది. కాగా, పురుషుల డబుల్స్ విభాగంగా మను అత్రి-సుమీత్ రెడ్డి జోడి 20-22, 19-21 తేడాతో డానీ బావా క్రిస్నాంతా-హెంద్రా విజయా(సింగపూర్) జంట చేతిలో పరాజయం చెందింది.