కొలంబో: పాల్ ఆడమ్స్ గుర్తున్నాడా?, 1995 కాలంలో పాల్ ఆడమ్స్ బౌలింగ్ యాక్షన్ ఒక సంచలనం. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ చైనామన్ బౌలర్ తన యాక్షన్ తో విశేషంగా ఆకట్టుకునేవాడు. కనీసం పిచ్‌ను చూడకుండా అతనెలా బౌలింగ్ చేస్తున్నాడో అని అంతా ఆశ్చర్యపోయేవారు. దాదాపు దశాబ్దపు కాలం పాటు టెస్టు క్రికెట్ ఆడిన ఆడమ్స్ 45 టెస్టు మ్యాచ్ ల్లో 134 వికెట్లు తీసాడు. ఇదిలా ఉంచితే, ఇప్పుడు అతన్ని మైమరిపించే బౌలర్ శ్రీలంకలో ఉన్నాడు.
శ్రీలంకకు చెందిన కుడిచేతి వాటం స్పిన్నర్ కెవిన్ కొత్తిగొడ.. ఆడమ్స్‌ను తలపించే బౌలింగ్ యాక్షన్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. మలేసియాలో జరుగుతున్న అండర్-19 ఆసి యా కప్‌లో కెవిన్ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్న కెవిన్.. శ్రీలంక జాతీయ జట్టుకు త్వరలోనే ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ 'మిస్టరీ' స్పిన్నర్ ఎంతవరకూ రాణిస్తాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment