న్యూఢిల్లీ:చైనా ఓపెన్ సూపర్ సిరీస్ కు భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ దూరమయ్యాడు. ఈనెల 14వ తేదీ నుంచి ఆరంభమయ్యే చైనా ఓపెన్ నుంచి గాయం కారణంగా శ్రీకాంత్ వైదొలుగుతున్నాడు. ఇటీవల నాగ్ పూర్ లో ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ షిప్ లో శ్రీకాంత్ కు కాలికి గాయమైంది. హెచ్ఎస్ ప్రణయ్ తో జరిగిన తుది పోరులో శ్రీకాంత్ గాయపడ్డాడు. దాంతో అతనికి కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని వైద్యుల సలహా సూచించారు.
ఈ క్రమంలోనే చైనా ఓపెన్ కు దూరం కావాల్సి వస్తుందని శ్రీకాంత్ తెలిపాడు. హాంకాంగ్ సూపర్ సిరీస్ కు సిద్ధమవుతానని శ్రీకాంత్ ప్రకటించాడు.ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న స్టార్ షట్లర్ శ్రీకాంత్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తూ నాలుగు టైటిళ్లను నెగ్గిన విషయం తెలిసిందే. ఫలితంగా ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ కెరీర్ బెస్ట్ ర్యాంకు '2'లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment