
ఇండియన్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్
న్యూఢిల్లీ:స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదంబి శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-16, 21-13 తేడాతో జుయ్ సాంగ్ (చైనా)పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు.
తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో్ సెట్ ను గెలుచుకోవడానికి మాత్రం కాస్త సమయం తీసుకున్నాడు. అయితే తన అనుభవాన్ని ఉపయోగించిన శ్రీకాంత్ చివరికి జుయ్ సంగ్ ను బోల్తా కొట్టించి రెండో గేమ్ ను కూడా కైవశం చేసుకున్నాడు.