
బ్యాంకాక్‌లో నేటి నుంచి జరుగనున్న థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ వైదొలిగారు. ఫలితంగా భారత ఆశలన్నీ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, పీవీ సింధులపైనే ఉన్నాయి.
తొలి రోజు క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ తరఫున రాహుల్ యాదవ్, శ్రేయాన్‡్ష జైస్వాల్, కార్తికేయ గుల్షన్ కుమార్, చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగనున్నారు.