పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటో(జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించి కెరీర్‌లో ఐదో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. 21-14, 21-13 తేడాతో రెండు సెట్లు గెలుచుకొని విజయకేతనం ఎగురవేశాడు.
ఈ గెలుపుతో సీజన్‌లో వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్నతొలి భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా కైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment